రచయిత్రి ధనాశి ఉషారాణికి లెజెండ్ సేవా పురస్కారం

 చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు
రచయిత్రి ధనాశి ఉషారాణి అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ  విభిన్న నూతన ప్రక్రియలను రూపొందిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కవి సమ్మేళనంలను  నిర్వహిస్తూ సమన్వయం చేస్తూ కవులను అందరినీ అనేక అవార్డులతో ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్నారు .అనేక నూతన ప్రక్రియలల్లో రచనలు చేస్తూ రూపొందిస్తూ రేడియో టివిల్లో కవితా హస్త్రాలను  సంధిస్తూ నేటి సమాజముకు ప్రేరణ కలిగిస్తూ పుస్తకాలను ముద్రిస్తూ ఉన్న నేపధ్యంలో  ఆదరణ వెల్ఫేర్ సొసైటీ ISO గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మార్కాపురం వారు మార్చి 20 తేదీన ఆంధ్ర లెజెండ్ సేవా పురస్కారం ను సంస్థ అధ్యక్షులు గొంటుముక్కల చెన్నకేశవులు అమరజీవి పొట్టిశ్రీరాములు  జయంతిని పురస్కరించుకోని ప్రకటించడము జరిగింది.ఇప్పటికి పదులు సంఖ్యలో పుస్తకాలు ముద్రించి 60 అవార్డులు 20 బిరుదులు అనేక రికార్డులు పొంది అనేక సేవ సంస్థల్లో అధ్యక్షురాలుగా గౌరవ అధ్యక్షురాలుగా  కీలక పదవులను నిర్వహిస్తూ వున్నారు. ఆంధ్ర లెజెండ్  సేవా  పురస్కారం అందుకోవడము అందరికీ ఆదర్శమని తోటి కవులు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు