కవితలంటే;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మధుపములుక్రోలు
మందార
మకరంద
మాధుర్యంబులు

పాలుత్రాగి
పవ్వళించె
పసిపాపల
పరవశంబులు

వెన్నెలందు
విహరించు
కన్నెపిల్లల
సౌందర్యంబులు

మధురమైన
మామిడిపండ్ల
లలితరసాల
తియ్యందనాలు

గలగలాప్రవహించు
గోదావరి
గాలితెమ్మెరల
కమ్మదనంబులు

ప్రొద్దొప్రొద్దునే
ఉదయించే
సూర్యుని 
అరుణకిరణంబులు

నీలిగగనంలో
నిండుగాకనిపించే
పున్నమిచంద్రుని
సోయగంబులు

కవితలను
చదువు
ఆస్వాదించు
ఆనందించు

కవితలను 
కాచి వడపోసి
కప్పులో పోచుకొని
కమ్మగా క్రోలుకొండి

మనసులను
మరిపించండి
మెరిపించండి
మురిపించండి


కామెంట్‌లు