మొండిపట్టు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒక్కొక్కసారి మనం అనుకున్నట్లు పరిస్థితులు అనుకూలించక ఆప్రాంతం ని విడిచి పెట్టి వెళ్లాల్సిఉంటుంది. తరతరాలుగా ఉన్న ఇల్లు ఊరు వదిలి వెళ్లం అంటే కుదరదు.మొండిగా మనకు శత్రువులు చుట్టిముట్టినపుడు అక్కడ ఉంటే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు మనం ప్ర త్యక్షంగా చూశాంకదా యుక్రైన్ నించి  మనమోడీజీ ఎంత శ్రమించి మెడిసిన్ చదివే భారతీయులను రప్పించారో?
ఇప్పుడు ఓకథ చదువుదాం! ఇద్దరు వేటగాళ్లు అడవిఅంతా తిరిగి ఏజంతువు దొరక్క అలసిపోయి ఓచెరువు కట్ట దగ్గర ఆగారు.చీకటి పడింది. ఆవెన్నెలలో నీటిలో తళతళమెరుస్తూ కొన్ని చేపలు కనపడ్డాయి."అరె చేపలు పడదామా?"రాము అన్నాడు. శివా అన్నాడు "ఇంత రాత్రి మనవల్ల కాదు.బాగా అలసిపోయాను.రేపు తెల్లారుతూనే పట్టుకుందాం".
ఈమాటలు చెరువులో చేపలువిని రాజైన మొసలిదగ్గరకువెళ్లి మొరపెట్టుకున్నాయి.మొసలి ఆవిషయాన్ని చాలా తేలికగా తీసుకుంది.మంత్రి నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది."ప్రభూ!మొసలి చర్మం విలువైనది. మనలను వేటగాళ్లు విడిచి పెట్టరు.మనం కూడా వేరే కాలువలోనైనా తలదాచుకుందాం."తరతరాలుగా ఇక్కడే ఉన్న ఆరాజుకి మంత్రి మాటలు నచ్చలేదు. ఆఇద్దరు మనుషులు చెరువులోకి దిగగానే అందరంకలిసి వారిని లోపలికి ఈడ్చుకుపోవచ్చు అని తన ఉద్దేశం బైట పెట్టాడు. చెట్టు మీద ఉన్న కోతులు బండరాయి అంత సైజుఉన్న తాబేళ్ళు కనపడితే  మంత్రి మొసలి తమగోడువిన్న వించింది.చేపలు చిన్న మొసళ్ళని కోతులు తాబేళ్ళు మోసుకుంటూ పోయి ఓపారే ఏరులో విడిచి పెట్టి తాముకూడా సురక్షితంగా  ఉన్నాయి.మొండి కేసిన మొసలి రాజు  కొన్ని చేపలు మాత్రం  వేటగాళ్లచేతికి చిక్కాయి.రాజభక్తులుగా ఉన్న చేపలు తమవారితో పోనందుకు వాపోయాయి.తనమూర్ఖత్వం వల్ల  ఇంత మంది కి  మనుషుల చేతిలో చావు ముంచుకొచ్చింది అని బాధపడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభంలేదు. మొండిపట్టు ఉండరాదు.🌹
కామెంట్‌లు