జాతి గీతం!!?;- ప్రతాప్ కౌటిళ్యా
లాగేసుకున్న వని నేనన్నానా!?
త్యాగం చేశానని నేను అంటున్నానా!!?
బలవంతుడనవనీ ప్రతిభావంతుడవనీ
అందరూ అంటుంటే వింటున్న
చూడాలనుకుంటున్నాను!!

క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లా
కాలం ముగిసిందని నేను చరిత్ర నై
నిన్ను వర్తమానంలోనే
ఉంచాలి అనుకుంటున్నాననీ నీకెలా చెప్పను!?
నీ చెప్పకనే చెప్పిన
మీ నమ్మకాన్ని నీ ఆత్మ విశ్వాసాన్ని
నేనేనని నీకు తెలుసా!!?
దేశ సరిహద్దుల్లో నే దేశమంతా కాపలా కాస్తుంది నీకోసం
సైనికుడు అవుతావా కావాఅనీ నేను అడగను!!?

నిన్నే దేవుని చేసిదేశాన్ని ఏలమనీ చెప్తుంటే
దేవాలయాలు నిర్మించి దేవుళ్ళ కోసం దేశమంతా గాలిస్తున్నావు!!
గాలి ఎటు వీస్తే అటు పయనించే తెరచాపల
నన్నే నావను చేసి నీకిస్తే
గాలి కోసం ఎదురు చూస్తున్నావు!!?

గాలిపటాన్ని కూడా దేశపటాన్ని చేస్తావని
మఠాలను పీఠాధిపతుల ను గాలికొదిలేస్తావేమోననీ
ఆదిశక్తి పీఠమే నీకు సమర్పిస్తున్నాను!!
బాబాలు యోగులను
శక్తి వంతుల్ని చేస్తున్నాను !?

అందుకోవాల్సీందీ ఆకాశం కాదని
అవకాశమే నని నీకు తెలిసేలా
దేశాన్ని దేశభక్తిని నీకు గుర్తు చేస్తూ వెళ్తున్నాను!!?

ఎప్పుడైనా నా ఎక్కడైనా నన్ను గుర్తు పట్టేది నీవు ఒక్కడివే ననీ
నీకు తెలిసేలా జాతీయగీత మే నీ జాతకం గా మారుస్తున్న!!?

ఎగరేసిన జెండా
గుండె చీల్చి నిన్ను చూపిస్తూ
దేశభక్తి గీతం పాడుతుంది!!
అధికారం కోసం అవినీతి కోసం
జాతి ప్రశ్నిస్తే
సమాధానంగా నిన్నే కంటాను!!?
నేను  నీ దేశ నీతిని నాతినీ!!

జైహింద్ జైభారత్
Pratap Kautilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏 8309529273

కామెంట్‌లు