అబద్ధాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 కొందరు తెల్లారుతూనే అబద్ధాలతో రోజంతా గడిపేస్తారు.ఈసెల్ఫోన్ పుణ్యమాని "బస్సు లో ఉన్నా.పావుగంట లో నీదగ్గర ఉంటా"అని సెల్ లో చెప్పేవాడు ఇంకా నిద్ర మంచంమీదే ఉంటాడు. పాపం ఆస్నేహితుడు లేక బంధువు అతని కోసం ఎదురు చూస్తూ తమపనులన్నీ వాయిదావేసుకుంటారు.మన అబద్దాలు వల్ల  అవతలి వారి సమయం వృధా చేస్తున్న సంగతి వీరికి పట్టదు.ఇలాంటి వాడే శివ. తండ్రి తోపాటు  సరుకులు బండీపై వేసి అమ్మేవాడు.ఒక సారి బండీమీదనించి కింద పడి మొహంకి గాయంఐంది."నాన్నా!రాజు గారి కొలువులో చేరుతాను.సైన్యంలో చేరుతా". "శివా!కులవృత్తికి మించినది ఏదీలేదు.కడుపులో చల్లకదలకుండా కుండలుచేసి చల్లగా అందరికీ నీరు అందిస్తున్నాం.చాపలు చేటలు బుట్టలు మీఅమ్మ అల్లుతోంది.వాటిని అమ్మటం సంతకి తీసుకుని పోవటం నలుగురితో కలిసి మెలిసి ఉండటంలోనే ఆనందం తృప్తి "అని ఎంత నచ్చ జెప్పి నా శివ వినకుండా రాజు గారిని కలిసి తానొక వీరులవంశంకి చెందిన వాడినని  కాస్త గొప్పలు చెప్పాడు.దృఢంగా చలాకీగా ఉన్న శివని తన అంగరక్షకునిగా నియమించాడు రాజు. నె లనెలా జీతం లో కొంత ఇంటికి పంపుతూ  నెమ్మది గా  మంచి పేరు  సంపాదించాడు.ఆరోజు  రాజు  తనపొరుగున ఉన్న  రాజ్యం పై బందిపోట్లు దాడిచేసిన  వార్త తెలీగానే"శివా!ఇప్పుడు నీబుద్ధి బలానికి  భుజ శక్తికి పరీక్ష.వెళ్లి  సరిహద్దుల్లో  కాపలావారికి అండగా నిలువు "అని  ఆదేశించాడు.అప్పుడు శివా వలవల ఏడుస్తూ "ప్రభూ!నేను మీదగ్గర కొలువు సంపాదించాలని అబద్దాలు చెప్పాను."అని తనకథంతా చెప్పాడు.రాజు కి విపరీతమైన కోపం వచ్చింది. "నీకులవృత్తి చెప్పటానికి నీకు  సిగ్గు  నామోషీ ఎందుకు?"అని  ముక్క చివాట్లు పెట్టాడు.మూడురోజుల జైలు శిక్ష విధించాడు.అందుకే  మనం చదువు  ఉద్యోగం విషయంలో  అబద్దాలు చెప్తే మొదటికే మోసం వస్తుంది. మనకు రాని పనిని వచ్చు అని బడాయిలు చెప్పటంకూడా మంచిది కాదు.పరీక్షలటైంలో తెలీనివి తోటి పిల్లలని అడిగి తెలుసుకోటం మంచిది 🌹
కామెంట్‌లు