పండు కి .....ప్రేమతో ..!!;-_డా.కె .ఎల్వీ .ప్రసాద్--హన్మకొండ

 (ఆన్షి బడి కి వెళ్లుతున్ది.గీతాంజలి..బేగంపేట)
*******
పండూ .....
ఆటపాటలతో 
ఆనందంగా -
గడిచిపొయింది 
ఇప్పటివరకు నీకు !
నీజీవితంలో .....
అసలి విద్యా ప్రస్ఠానం 
ఈరోజునుండేకదా ...!
నీకు తిరుగులేదు 
సాగిపో ముందుకు ...
చదువు -క్రీడలు 
లోకజ్ఞానం అన్నీ 
ఇకనువ్వు ...
ఆనందంగా ఆస్వాదించే 
విజ్ఞాన పరిమళాలు !
తాత ఎప్పుడూ 
నీవంకే చూస్తుంటాడు 
నీ ..అభివృద్దిని 
వెయ్యికళ్లతో వీక్షిస్తుంటాడు !!
            ---ప్రేమతో...తాత*
కామెంట్‌లు