మరాఠీ కథ ఆధారం ...ప్రాయశ్చిత్తం!అచ్యుతుని రాజ్యశ్రీ

 దయానిధి కాస్తోకూస్తో చదువు కున్న వాడు.తరతరాలుగా పెద్దలసుద్దుబుద్ధులు రక్తంలో జీర్ణించుకుపోయాయి.ఎంత మంచి గా  ఒద్దికగా ఉన్నా కూడా హఠాత్తుగా అమ్మా నాన్న చని పోవడం తో 15ఏళ్ళ వాడు తిండి తిప్పలు లేక అలమటించి పోయాడు. అడుక్కుని తిందామంటే అభిమానం అడ్డువస్తోంది.పైగా ఆఊరివాళ్లు కొట్లాటలు పార్టీ కక్షలు కుమ్ములాటలతో ఎవరికి వారే యమునా తీరేలా మారారు.ఒకరింటిలో పనికి కుదిరాడు.గొడ్డు చాకిరీ చేయించి  తిండి పెట్టక మాడ్చి చంపటంతో ఇంకో చోట పనికి చేరాడు.ముఠాతగాదాలున్న వారు తమచేతిలోని కుర్రాడు శత్రువు ఇంట ఆశ్రయం పొందటం నచ్చక వాడిని లొంగదీసుకోవాలని ప్రయత్నించి వాడు దొంగ అని ప్రచారం చేశారు. ఇంకేముంది?ఇదిగో పులి అంటే అదిగో తోక జనం అన్యాయం గా చితకబాది వెళ్లగొట్టారు.
అనవసరంగా తనపై పడిన అపవాదుతో వాడిలో కసి కక్షపెరిగాయి.ఆఊరినించి దూరంగా పారిపోయి చిన్న చిన్న దొంగతనాలు చేయటం కుక్షినింపుకోటం చేస్తున్నాడు.ఒకసారి ఇద్దరు పెద్ద మనుషులు యాత్రలకి బైలుదేరారు. వారి దగ్గర కాస్తోకూస్తో డబ్బు ఉంటుంది కాబట్టి దయానిధి  దారిలో వారిని  దోచుకోవాలని ఉపాయం పన్నాడు.నుదుటవిభూతిరేఖలు కుంకంబొట్టుపెట్టి "అయ్యలారా!రెండేళ్ళ క్రితం నాతల్లిదండ్రులు పరమపదించారు.నాకు యాత్ర లు చేయాలని ఉంది. మీసామాన్లుమోస్తాను.ఇంతతిండి పెట్టండి. మీమనవడిగా నన్ను భావించండి" అని బతిమాలాడు. వాడివేషభాషలు మాటచూసి వారు కరిగిపోయారు.ఇద్దరు అరవైదాటినవారు.తమకు తోడుగా ఉంటాడు అని  సమ్మతించారు.వారిని ఎలా దోచూకోవాలా అని వాడిప్లాన్! నాల్గు రోజుల యాత్రలో రెండు పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుని ఆసత్రంలో నిద్ర కి ఉపక్రమించారు.వృద్ధులు నిద్ర పోగానే  దయానిధి వారి సంచులలోని డబ్బు మూటని కాజేసి ఓరహస్యస్థలంలో దాచి వీరిదగ్గర కొచ్చి పడుకున్నాడు.తెల్లారుతూనే పారిపోవాలనుకున్నాడు.కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలచినట్లు అర్ధరాత్రి బందిపోటు దొంగలు సత్రంలోకి ప్రవేశించి  అందరినీ సోదాచేయసాగారు."అయ్యా!వారిద్దరూ నాతాతలు.మేము దైవదర్శనం కోసం బైలుదేరాము.మాదగ్గర ఏమీలేదు. "అని దీనంగావేడుకున్నాడు.నిద్ర లో ఉన్న ఆవృద్ధులు వాడిఏడ్పుకి ఖంగారు గాలేచి కూచున్నారు.దయానిధి తోపాటు వారి ఇద్దరిదగ్గర కట్టుబట్టలు తప్ప ఏమీలేవు అని సోదాచేసిన దొంగలుమిగిలిన వారిని దోచేసి తమదోవన తాముపోయారు. మిగతా యాత్రికులు లబోదిబో అని బాధపడుతున్నారు. దయానిధి ఆవృద్ధులతో ఇలా చెప్పాడు"ఇక్కడ దొంగలబెడద ఎక్కువ ఆని తెలుసు కున్ననేను మీడబ్బు మూటలు సురక్షితం గా దాచాను"అని చెప్పి వారి మెప్పు పొందాడు."నాయనా!నీవల్ల  డబ్బు  మన ప్రాణాలు దక్కాయి.ఇక నీవు మాతో మాఇంట్లో నే చెరో 15రోజులుందువుగాని!మాతోపాటు పూజపునస్కారాలు గుడిపనులు చేద్దువుగానీ"అని  ఇంటిదారి పట్టారు.వారి మంచి తనం దైవానుగ్రహం తో దయానిధి  ఒక మంచి యువకుడు గా అందరితలలో నాలుకగామారాడు🌷
కామెంట్‌లు