పూల ఎదల పై కదలిక లేమో
కలలు ఒక్కొక్కటీ
నిదుర లోకి జారు కుంటున్నా వి !?
బృందావనం మౌనంగా
కళ్ళు మూసుకుందేమో
తోటమాలి తొలి పిలుపు కూ
పువ్వులన్నీ నవ్వుకున్నాయి!!?
మెత్తని మేఘాల హృదయంలో
కొత్త కొత్త చిత్తాలు పుత్తడి భామలై
గగనాన వానలు మొదలైనాయి!!
చీకటికి దారి చూపిన వెలుగు కలువ
వెన్నెలంతా ఖాళీ చేసింది
సిగ్గుతో సిగలోనీ మొగ్గల బుగ్గలు గిల్లిన
దారం ఆ అధరం మకరందం అంతా
దోచేసింది!!
లేత ఆకుల జత పై లత లెలా చుట్టూ
చుట్టుకున్నాయో
అది కాస్తా పందిరి అయింది!!?
గుమ్మడి పువ్వు సైగతో
తీగలు తలుపులు తీసే ఉంచిన వీ
దీపం వెలిగించి దిష్టి తీయాలి సిందే !!?
చల్లని చూపుల వెనకాల
రాత్రంతా కరిగించిన కాగడాల వేడి
ఇప్పుడిప్పుడే రాలిపోతుంది !!
మైనం పిండితే తేనే పంట పండినట్లూ
గుండెను పిండేస్తున్న గువ్వపిల్ల కళ్ళు కఠినంగానే ఉన్న కాటుక దిద్దిందీ!!?
పారే ఏరు పైట ధరించి పాదాల
ఎద లపై మునివేళ్లతో తొక్కిన నీటి చుక్కలా
ఉంది ఆమె !?
వీడని గాలిలా అంతా వ్యాపించి
కనిపించని చెలి ఆమె!!!
జాలితో కొంచెం కొంచెం చల్లిన వెలుగులా
దేహాలయాలపై పొద్దుపొడుపు అయింది!!?
ఒంటికి తప్ప కంటికి కనిపించని
పరిమళమేదో మైకం కమ్మించే మొగలి పొద లా కాలే ఎదా ఊరేగుతున్న
రథంలాఉందీ!!?
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
SRI SRI KALAVEDIKA President
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి