కుంతికోరిక. పురాణ బేతాళ కథ. ; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి  భుజంపైకి చేర్చుకుని మౌనంగా నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదలకు అభినందనలు. నాకు కుంతి శ్రీకృష్ణుని ఏమికోరుకుందో తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు'అన్నాడు.
'బేతాళా కుంతి యాదవరాజు సూరసేనుని కుమార్తె,ఈమెఅసలు పేరు పృధ.వసుదేవుని సహాదరి,శ్రీకృష్టుని మేనత్త,కుంతిభోజుని దత్తపుత్రి అయినందున ఆమెకు ,కుంతిదేవి అనే పేరువచ్చింది.బాల్యంనుండి భక్తిభావం తో పెరిగిందిఈమె.ఓకరోజు తమఇంటికి అతిధిగా వచ్చిన దుర్వాసమహముని కిసేవలు చేసింది.ఆమెసేవలకు సంతసించిన దుర్వాసముని కోరినవారితో సంతానం కలిగే మంత్రాన్ని ఉపదేశించాడు. ఆమంత్రంతో సహజ కవచ కుండలాలతో బాలుడు జన్మంచగా మందసంలో పెట్టి నీటిలో వదులుతుంది.ఆబాలుడు అర్దరధుడైన రాధేయుడుఅనేవానికి దొరకటంతో 'కర్ణుడు' అనిపేరుపెట్టి పెంచాడు.అనంతరం పాండురాజును వివాహం చేసుకుంటుంది.కిందమముని స్త్రీనికూడితేమరణి స్తావు అని శాపించగా, అపాండురాజుమాద్రికి చేరువకాబోయి మరణంతోఆమంత్రప్రభావంతో యమధర్మరాజు ద్వారాధర్మరాజును,వాయుదేవుని ద్వారా భీముని,ఇంద్రునిద్వారా అర్జునుని పొందుతుంది.అదేమంత్రాన్ని తన సవితి మాద్రికి ఉపదేసించిగా ఆమె  అశ్వనిదేవతలద్వారా నకులసహదేవులకు జన్మనిచ్చింది. 
కురుక్షేత్రసంగ్రామం అనంతరం ఒకరోజు శ్రీకృష్ణుని ప్రార్దించగా వచ్చిన శ్రీకృష్ణుడు'అత్తా ఎందుకు పిలిచావు'అన్నాడు.'కృష్ణా నాకు ఎప్పుడూ కష్టాలను ఇవ్వయ్య' అనికోరుకుంది. 'అత్తఇదేంకోరిక ఇంతకాలంకష్టాలేకదా అనుభవించావు,ఇప్పుడు అయినా సుఖఃగాఉండుఅన్నాడు.'ఈసుఖాఃలలో రాజభోగాలలో నిన్ను ఎక్కడ మేము మర్చిపోతామో అని భయంగా ఉందయ్య' అన్నది కుంతి.'అత్తముపైఆరుసంవత్సరాలునీబిడ్డలురాజ్యపాలనచేస్తారు.అనంరం నాఅవతారసమాప్తి జరుగుతుంది.ఈలోగా, మావారంతా గాంధారి,దుర్వాసుల శాపవలన తమలోతాము కలహించుకునిమరణిస్తారు.అనంతరంనీబిడ్దలు స్వర్గప్రాప్తిపోందుతారు.నేను ఉన్నంతకాలం మీకు,మీబిడ్డలకు ఎటువంటి ఆపదారాదు'అని ఆమెను ఓదార్చి వెళ్లాడు శ్రీకృష్ణుడు.
కొంతకాలం పాండవులవద్ద ఉన్న ధృతరాష్టుృడు,తన మంత్రులైన విదురుడు, సంజయుడు,గాంధారి,కుంతి లతోకలసి వనవాసంలో ఉండగా జరిగిన అగ్నిప్రమాదంలో అందరు మరణించగా,ధృతరాష్టుృని కోరికమేరకు తప్పించుకున్న సంజయుడు వారిమరణ వార్తలోకానికితెలియజేసి, హిమాలయాల దిశగా సాగిపోయాడు' అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగం కావడంతో శవంతోసహా మాయమై తిరిగి చెట్టుపైకిచేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు తిరిగి బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు