హైకూలు ;-ఎం. వి. ఉమాదేవి
🧑భూమి చూస్తుంది 
   గోలీలాడే పిల్లల 
  అంకిత భావం 

🚣నదిలో దుంగ 
  ఒడ్డునున్న వాళ్ళకి 
ఉపాధి దైవం 

తొండ పిలుపు 
  అదృష్టం మోసుకొని 
ఆకలి కేక 🦖

కాలువ స్వేచ్ఛ 🦆
  బాతులతో వర్ధిల్లి 
ఖాళీ అయింది 

🔥కొలిమి సెగ 
   తగ్గించు కుంటున్నది 
ఆమె స్వేదంతో 
 


కామెంట్‌లు