కమ్మని కల (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మబ్బుల పరుపు పరుచుకొని
 చందమామను దిండుచేసుకొని 
చిన్ని పిట్టలు రాగంతీయగ 
చిన్న జంతువులు నాట్యంచేయగ
చెట్ల కొమ్మలు ఊయలలూపగ 
పిల్ల తెమ్మెరలు జోలలుపాడగ 
బజ్జో బజ్జో మాపాప 
కమ్మని కలలే కనవమ్మా 
కలలో నువ్వే మా రాణి!!

కామెంట్‌లు