బ్రతుకుబాట **ఆశ్చర్య చకితుడనై **కోరాడ నర సింహా రావు

  *****105 ********
" ప్రజాబంధు "అనో... "లోకనా యక్ అనో"... ఉత్తమపౌరుడు అనో... "సహస్రకవిమిత్రుడు అనో... ఇలా, అనేకరకాల బిరుదులు ఎవరెరెవరో... ఎవ రెవరికో ఇవ్వటం... వాళ్ళు ఆ బిరుదుల్ని పేర్లుకు ముందు తగి లించుకుని ప్రచారం చేసుకో వటం... చాలానే  చూసాను !
గానీ... ఒకరోజు  ఒక సాహితీ శ్రేష్ఠురాలుగారు ఫోన్ చేసి... 
"ఏమండీ కోరాడ వారూ... మీకు ప్రముఖుల చేతుల మీదుగా* డాక్టరేట్ * ప్రధానం చేయిస్తాను మీరు ఫలానా చోటుకి రావాలి... మీకు డాక్టరేట్ కావాలా ?...మీరు వస్తారా.. ?"" అని  అడిగారు!
నేనేమిటి...,నాకు డాక్టరేట్ ఇవ్వటమేంటి !? ఆశ్చర్య పోయాను ! అప్పుడనిపించింది 
నాలాంటి వాళ్ళుకూడా ఇలాం టివి పొందవచ్చునన్నమాట
అని !!
అమ్మా మీరైతే నాకు.... 
నామీదున్న అభిమానంతో,
నాసాహిత్య, కళారంగాల కృషిని గుర్తించి* డాక్టరేట్ * ను 
ఇప్పించగలరు !
గానీ నేనెక్కడికి రావాలంటే... 
నేనొక్కడినే రాలేను, ఒక మనిషి తోడు కావాలి ! చార్జీలు,ఖర్చులు... చాలానే అవుతాయి అవన్నీ ఎవరిస్తారమ్మా ?!అని అడిగాను !
అదేమిటండీ... అలా అంటారు 
డాక్టరేట్ మీకిస్తున్నారు కనుక అవన్నీ మీరే భరించాలి, అన్నారావిడ !
నాకంత ఆర్థికావకాశాలు లేవమ్మా అని తేల్చి చెప్పేసేసరికి సరే ఐతే మీ ఇష్టం 
అని అనేసారావిడ !అప్పుడప్పుడూ ఇలాంటిఒకటి, రెండు సంఘటనానుభవాలు 
నాలో కొత్త అనుమానాలకు తెర తీస్తుండేవి !
చిన్న -  చిన్న బిరుదులూ సత్కారాలే కాకుండా ఇంత గొప్పవి పొందినోళ్లందరూ నిజంగా వారి - వారి ప్రతిభ ఆధారంగానే పొందారా..., లేక 
ఇలాంటి అడ్డదారుల్లోనూ పొం దారా... !!నే అనుమానం వస్తుంది !
 ఓ మారు నేను హిందీ కాలేజ్ లోపనిచేస్తున్నరోజుల్లోనే,ఇంతో, అంతో సాహిత్యం లో పేరున్న సాహితీమిత్రులోకాయనవచ్చా రు... ఏమిటండీ ఇలావచ్చారు అని అడిగితే...ఇక్కడ మాష్టారి సౌజన్యంతో నాపుస్తకమొకటి అచ్చువేయించారండీ, ఆ కాపీ వారికి ఓ మారు చూపిద్దామని వచ్చాను అంటూ ఒక పుస్త కాన్ని నాచేతిలోపెట్టి చూడమ న్నారు !
ఆపుస్తకాన్నితెరిచి,పేజీలుతిప్పుతూ  చూస్తున్నాను మొదటి పేజీల్లోనే ఓ చోట ఆ పుస్తక రచయితను ప్రశంసిస్తూ... ఆ పుస్తక ప్రచురణకు సహకరిం చిన దాత రాసినట్టుగా ఓ పద్యం కనిపించింది !
నేనాశ్చర్య పోయాను !!ఖచ్చితంగా ఆ పద్యo... అతను రాసింది కాదు !ఈ పద్యం ఇతను రాసినది కాదు, దీన్ని ఎవరు రాసారు అని అడిగేసరికి భుజాలు తడుముకున్నట్టు హి.. హి.. హి 
ఈ పద్యం నేనే రాసి... ఆ దాత పేరు తగిలించాను అని ఉన్న నిజాన్ని ఆ రచయిత ఒప్పేసు కున్నారు !
అప్పుడు నాకనిపించింది... 
చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద అనే కావ్యాన్ని రాసాడని, ఇంకెవరెవరో మంత్రులూ, దండనాయకులూ కూడా ఏవేవో కావ్యాలు రాసారని చదివిన దాంట్లో సత్యమెంత అనే సందేహం నాకు కలిగింది!
 సినిమాల్లో కొందరు, కధలు, మాటలు, పాటలు రాస్తూ కూడా గోస్ట్ రైటర్ లుగానే ఉండిపోతున్నారని విన్నాను !
మన దాసరి నారాయణ రావు గారి లాంటి వారు కథ, స్క్రీన్  ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం కింద తనపేరు వేసుకున్నా... అందులో చాలావరకూ శ్రమించిందింకె వరెవరోనని... చెప్పుకోవటం కూడా విన్నాను !
ఇలాంటివన్నీ వింటూ, కొన్ని, కొన్ని ప్రత్యక్షంగా అనుభవైక వే ద్య మవుతున్న తరువాత ఇలాంటివేవీ పూర్తిగా నమ్మలేక పోతున్నాను !
గొప్ప, గొప్ప అవార్డులు, రివార్డులు సత్కారాల విషయంలో... ఈ కవులు, కళాకారులు, తత్సంబంధిత నిష్ణాతులు... ఆయా అవార్డుల కోసం, బిరుదుల కోసం, సన్మాన సత్కారాల కోసం వారే దారకాస్తులు పెట్టుకుని వారి ,వారి ప్రతిభను వారే నిరూపించుకోవాల్సిన దుస్థితి, దౌర్భాగ్యం !
ఇలాంటిదుస్థితికి మనసు అంగీకరించక అలాంటి ప్రయత్నాలే అసలు చెయ్యని వారెందరు లేరు !
ఇంకఅందులోనూస్వపరబేధాలు,రికమెండేషన్లు...!
ఈ పద్దతే సరికాదన్నది నా అభిప్రాయం !
ఇందుకోసం ప్రత్యేకించి కమిటీలు వేయాలి.., తత్సంబంధిత విషయాలలో నిష్ణాతులెవరు అన్నది ఆయా కమిటీలు పరోక్షంగా పర్యవేక్షించి,పరిశీలించి,గుర్తించి, నివేదికను అందించాలి !
నిష్పక్షపాతంగా... నిర్ణయాలు జరగాలి ! అంతవరకూ ఇప్పుడిస్తున్న అన్నిరకాల అవార్డులు, రివార్డులు... బిరుదులూ అన్నీ  చాలావరకూ 
అపాత్రదానాలే.., అని నాకనిపించి కలతచెందటం తప్ప నాలాంటివాడు చెయ్యగలిగేదేముంటుంది !?
      ******
............     సశేషం     ..........
కామెంట్‌లు