పూలకున్న
పొంకాలను
పడతులకిచ్చి
పరవశించనీ
పూవులకున్న
పరిమళాలను
పవనంతోచేరి
ప్రసరించనీ
పుష్పాలకున్న
ప్రేమతో
ప్రపంచాన్ని
పరిఢవిల్లనీ
పువ్వారులకున్న
పెక్కురంగులతో
పరిసరాలను
ప్రకాశించనీ
సుమాలకున్న
సుకుమారాన్ని
మనుజులయొక్క
మేనులనుచేరనీ
పువులకున్న
నిస్వార్ధబుధ్ధిని
ప్రజలెల్ల
పాటించనీ
పీలువులకున్న
పరోపకారగుణాన్ని
ప్రజలంతా తెలుసుకొని
ప్రవర్తించనీ
పువ్వులకున్న
నవ్వులతో
మోములను
వెలుగనీ
ఫల్యములకున్న
పలుసొగసులను
ప్రకృతినంతా
పాకనీ
పుష్పాల
పనులుచూచి
పుడమితల్లి
పులకించనీ
ప్రసూనాలిచ్చిన
ప్రేరణతో
కవులను
కవితలనువ్రాయనీ
పుష్పలోకంలో
విహరిద్దాం
పూలానందాన్ని
పొందుదాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి