భరధ్వాజుడు. పురాణ బేతిళ కథ.; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు భరధ్వాజుడు గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావోమరణిస్తావుఅన్నాడు.
' బేతాళా వేదాల ప్రకారం, భరద్వాజ బార్హస్పత్య అనేది ఈతని అసలు పేరు. ఆ పేరు లోని బార్హస్పత్య అనేది వీరి తండ్రి అయిన బృహస్పతిని స్పురణకి వచ్చేవిధంగా ఉంటుంది. శతపథ బ్రాహ్మణం ప్రకారమే కాకుండా, వేదాలలో కూడా ప్రస్తావించిన సప్త ఋషులలో ఈయన కూడా ఒక్కరు. సప్త ఋషుల గురించి మహాభారతంలోనూ, పురాణాలలోనూ కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణాల ప్రకారం ఈయన అత్రి మహర్షి కొడుకుగా చెప్పబడింది.
చరక సంహిత ప్రకారం, ఈతడు వైద్య శాస్త్రాన్ని దేవతల రాజు అయిన ఇంద్రుని వద్ద అధ్యయనం చేసాడు.
భరద్వాజ అనే పదాన్ని సంస్కృతంలో, "భార(ద్) , వాజ్( మ్ )" అనే రెండు పదాల కలయిక వల్ల ఉద్బవించింది.
గోత్ర ప్రవర చెప్పేటప్పుడు త్రయా ఋషుల ప్రవరలలోని ఒకదాని యందు, ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ అనే ముగ్గురు ఋషులు ఉన్న గోత్ర ప్రవర చెప్పేటప్పుడు ఈయన పేరును మొదటిగా చెప్పడం జరుగుతుంది.
అంగీరస మహర్షికి, శ్రద్ధకి జన్మించిన కుమారులలో ఒకరు బృహస్పతి. బృహస్పతి అన్న ఉతథ్యుడు. ఉతథ్యుని భార్య మమత. దేవగురువు అయిన బృహస్పతి యొక్క భార్య తార. ఉతథ్యుడు తీర్థయాత్రాపరుడైన సందర్భములో, మమత గర్భవతిగా ఉండగా, గర్భములోని శిశివు వలదు అని మొర పెట్టుకున్ననూ, అన్న భార్య అని కూడా చూడక, ఉతథ్యుడు ఆశ్రమమునకుఅతిథిగావచ్చినదేవగురువైన బృహస్పతి భార్యను  బలవంతముగా సంగమించుట జరుగుతుంది. మమత గర్భములో ఉన్న శిశివును ఆ సందర్భములో బృహస్పతి అతనిని అంధుడు పుట్టమని శపిస్తాడు. బలవంతముగా సంగమించి, మమత గర్భములో ఉన్న శిశివు బృహస్పతి విడిచిన వీర్యమును బయటకు తన్ని వేయుట జరుగుతుంది. ఆ వీర్యము నేలపై పడి బాలుడు కాగా, బృహస్పతి ఆ బాలుడును, గర్భములో ఉన్న శిశివుతో పాటు తనకు ఇద్దరు పుత్రులు ఉదయించారని చెప్పుకోమని అనటం జరుగుతుంది. దానికి మమత అంగీకరించ లేదు. బృహస్పతి కూడా పుట్టిన బాలుడుని తీసుకు వెళ్ళేందుకు సమ్మతించ లేదు. నువ్వు పెంచమంటే నువ్వు పెంచమని ఆ బాలుడిని విడిచి వేయటం జరుగుతుంది. బృహస్పతి వేళ మించి పోతోంది అని తన దారి తాను వెళ్ళి పోయాడు. అదేవిధముగా మమత కూడా ఆ బాలుడిని వదలి వెళ్ళింది. మమత, బృహస్పతి ఇద్దరిచే విడిచి వేయబడిన వాడు కనుక ఆ బాలుడు ద్వాజుడు అయ్యాడు.
భరద్వాజ మహర్షికి ద్వాజుడు, భరద్వాజ, భరద్వాజుడు, భారద్వాజుడు, భారద్వాజ మహర్షి అని అనేక పేర్లతో పిలుచు చున్నారు. ఈయన తపము సాగించిన ఆశ్రమము భారద్వాజతీర్థ అని పేరు. భరద్వాజ మహర్షి ప్రశాంత, పరమ పవిత్రత కలిగి సప్త మహర్షులలో ఒకరు.
భరద్వాజ గోత్రం ప్రవరసవరించు
భరద్వాజ : ఆంగీరస, భార్హస్పత్స్య, భరద్వాజ త్రయా ఋషేయ ప్రవరాణ్విత భారద్వజాస గోత్రస్య
శతపథ బ్రాహ్మణం రచయిత అయిన యాజ్ఞవల్క్య, భరద్వాజ మహర్షి యొక్క వంశస్థుడు.
<-------------->నవ బ్రహ్మలలో ఒకడు. నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు. 1. రు|| ఉతథ్యుని కొడుకు. తల్లి మమత. ఇతఁడు తన పెదతండ్రి అగు బృహస్పతివలన జనించినవాఁడు. ఇతని ఆశ్రమము శృంగిబేరపురమునకు దక్షిణమునందు కల ఇప్పటి ప్రయాగ. ఘృతాచిని చూచి ఇతఁడు ఒకప్పుడు చిత్తచాంచల్యము పొందఁగా రేతస్సు జాఱెను. అంతట ఆరేతస్సును ఇతఁడు ద్రోణమందు సంగ్రహించి ఉంచెను. దానివలన ఇతనికి ద్రోణుఁడు అను కుమారుఁడు కలిగెను. కొందఱు ఈరేతస్సు ఘటమునందు సంగ్రహింపఁబడెను అంటారు. కనుక ద్రోణుఁడు కుంభసంభవుఁడు అనబడెను'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు