* అడవులు * మన ఆది మానవుల ఆవాసాలు !
వానరుడు నరునిగా రూపాం
తరం చెంది... రాయిని, కర్రని ఆయుధాలుగా మలచుకుని
మిగతావన్యప్రాణులన్నిటిపైనా
ఆధిపత్యం చలాయించటం మొదలుపెట్టింది ఇక్కడే... !
ఈవనరులతోనేసుదీర్ఘకాలం
ఆదిమానవుని జీవనం !
సహజసిద్ధ ఆరోగ్యకర ఆహారాన్నందించింది తొట్ట తొలుత అడవులే !
మనిషి జీవనం మైదానాలకు మారినా... స్థిరనివాస ఉపకారణాలన్నీ అందించింది అడవులే !
సకాల ఋతు ఆగమనాలకు
సహేతుక సారధులివి !
కొండలతో, గుట్టలతో, లోయ లతో, సుందర జలపాతాలతో
పశుపక్ష్యాది వివిధ వన్య ప్రాణు లతో అందాలు చిందుతూ...
అలరారిన అడవులు, మనిషి అతిసుఖాకాంక్షకు అంతరించి పోతున్నాయి !
ఎన్నెన్నిఅడవులుఅంతరించి పోయాయి !
ఎన్నెన్నికొండలుకరిగిపో
యాయి !!
మనం శ్రమపడి వాటికి సేవచేసి
సంరక్షించకపోయినా...మన
సుఖాలకి ఎన్నో అందిస్తున్న కల్పవృక్ష నిలయాలవి !
అనునిత్యం బంగారు గుడ్డును పెట్టే బాతును, పేరాసతో పీకను కోసేసినట్టు... ఈ మూర్ఖ మానవుడు బ్రతుకునిచ్చిన వనా లను బ్రతకనీయక, తన బ్రతుకును తానే బుగ్గిపాలు చేసుకోవటం..ఎంత అవివేకం!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి