సునంద భాషితం; -వురిమళ్ల సునంద, ఖమ్మం
 బంధీ..వారధి.. సారథి...
******
కష్టాలు మన చేతుల్లో లేకపోయినా కాలం మన చేతిలోనే ఉంటుంది.
భవిష్యత్తు మనకు తెలియకపోయినా వర్తమానం మన అధీనంలోనే ఉంటుంది.
గతం గతఃనే.దాన్ని తిరిగి పొందలేం. తల్చుకుని బాధ పడుతూ దానికి బంధీ అయితే మాత్రం,శత్రువులా వెంటాడుతూ వర్తమానాన్ని శూన్యం చేస్తుంది.
అందుకే గతానికెప్పుడూ బంధీ కాకూడదు.
గతానికి భిన్నంగా వర్తమానాన్ని అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవడం మన మీదనే ఆధారపడి ఉంది.
వేధించే గతానుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటూ, కాలాన్ని చేజారి పోనివ్వకుండా,వర్తమానాన్ని ఫలవంతం చేసుకోవాలి.అప్పుడే భవిష్యత్తుకు  వారధి, సంతోషానికి సారధి కాగలం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు