తర్కం! అచ్యుతుని రాజ్యశ్రీ
 మనం ఏదైనా శాస్త్రం అభ్యసిస్తే సరిగ్గా ఆలోచించి అమల్లో  పెట్టాలి.కొంత మంది బాగా చదువుకుంటారుగానీ వారికి లోకజ్ఞానం ఉండదు.శివ గోపి రాజు మంచి పాఠశాలలో చదివి తర్కశాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నారు. కానీ అనవసరంగా తర్కిస్తూ గురువుకి తలనెప్పిగామారారు. పైగా నవ్వులపాలైనవారిని భరించ లేక ముగ్గురిని బైట కి పంపాడు ఆయన. అలావెళ్తున్న వారి కి రెండు దార్లు కనపడటంతో ఆలోచన లో పడ్డారు."అరె!తూర్పు దిక్కు గావెళ్తే శుభం"శివ మాటలతో సైఅన్నారు మిగతా ఇద్దరు. "అరేయ్!జనమంతా స్మశానంవైపు వెళ్తున్నారు. వారంతా పండితులు గా ఉన్నారు. "అని గోపి అన్నాడు. ముగ్గురు ఆజనంవెనకే కాస్త దూరంలో నడవసాగారు.అక్కడ వారికి ఓ గాడిద కనపడటంతోరాజు అన్నాడు "అసలు సిసలు మిత్రులు ఎవరో తెలుసా?ఆపద కరువు కాటకం యుద్ధం  కోర్టు స్మశానంలో మనకు దగ్గరగా అండగా నిలి

చేవారు." ఇంకేముంది?ఆగాడిదకు తాడుకట్టి తమతో తీసుకుని వెళ్లుతుండగా ఓగుర్రం కనపడింది. "ధర్మగ్రంధాలలో వేగం చురుకు గలది కేవలం ధర్మం  అని చెప్పబడింది. గుర్రం చురుకు  వేగంకి చిహ్నం!కాబట్టి గుర్రం గాడిదను కట్టివేసి  మనతో తీసుకుని వెళ్దాము "అని  ఆమూర్ఖులు ఆరెండు జంతువుల ను ఒకే తాడుకి కట్టివేసి  లాక్కుని పోతుండగా వాటి యజమానులు వెతుక్కుంటూ వచ్చి "మాపెంపుడుజంతువులను లాక్కుని వెళ్లే అధికారం మీకు  ఎవరిచ్చారురా?" అని వారి ని చితకబాదారు. వారు చావుతప్పి కన్నులొట్టపోయి ఓపల్లె చేరారు. ఆకలి తో ఆవురావురు అంటూ తలాఒక దిక్కు కి వెళ్లారు. ఆరోజు ల్లో అమ్మా ఆకలి అంటే చాలు  కడుపు నిండా అన్నంపెట్టే దాతలుండేవారు.శివ కి ఆఇంటియజమాని బాగా తీపి వంటకాలు వడ్డన చేసిఅన్నం కొంచెంగా పెట్టాడు. "హమ్మో! తీపి ఎక్కువ తింటే చక్కెర వ్యాధి వస్తుంది. నాకు వద్దు "అని  ఏమీతినకుండా బైట పడ్డాడు. గోపీకి ఒకరింట్లో చారు పల్చని మజ్జిగ విస్తరాకు దగ్గర పెట్టారు."నేను చదువుకున్న శాస్త్రంలో విస్తరి లోంచి  కారి పోయేవి తింటే ఆయుష్షు తరుగుతుంది అని ఉంది. నేను తినను"తినకుండా  లేచాడు.రాజు వెళ్లిన ఇంటి ఇల్లాలి గారెలు వడ్డన చేసింది. "అయ్యోరామ!చిల్లి వస్తువు తింటే చెడు జరుగుతుంది "అని వాదించి మాడే పొట్ట తో బైలుదేరాడు. ఆముగ్గురు మూర్ఖులు బుర్రతక్కువ బుద్ధితక్కువ  తర్కంతో ఆకలి కి నకనకలాడుతూ మళ్లీ గురువు గారి గూటికే చేరారు.పాపం  గురువుగారు వారిని ఆదరించారు అంటే ఆయన దొడ్డబుద్ధి!🌹
కామెంట్‌లు