వికారాబాద్ సంఘం లక్ష్మీ బాయి గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు;-మొలక ప్రతినిధివెంకట్:
 ముఖ్య అతిథిగా పాల్గొన్నSAP కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ దేవకీదేవి
తాండూర్ విద్యావేత్త కీర్తి శర్మ
ప్రపంచ మహిళా(8 మార్చ్) దినోత్సవం పురస్కరించుకొని
వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి బాలికల గురుకుల పాఠశాలలో
ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేశారు
ఈ కార్యక్రమంలో SAP కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ దేవకిదేవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ
చిన్నారులు తెలుగుపై మమకారం తో పుస్తకాలు రాయడం చాలా అభినందనీయం అన్నారు.
మణి పూసలురాసిన   నందినిని అభినందించారు.
 స్త్రీలుసమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి 
 తల్లిలేకుండా కుటుంబం సంతోషంగా ఉండదన్నారు
స్త్రీలకు  ఓపిక సహనం చాలా ఉంటుంది.
మహిళలపైన అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని
ఈ విషయంపై  అమ్మాయిలు మహిళలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
పూర్వ కాలం లోకష్టపడి
పడి చదువుకున్న రోజులు ఉన్నాయి
నేటి సమాజంలో సెల్ఫోన్ మహామారి వల్ల
అనేక కష్టాలు వస్తున్నాయి.
విద్యా వలనే వినయం వస్తుంది
మహిళలందరూ విద్యుక్తధర్మం తో పని చేయాలన్నారు
 నేటి సమాజంలో ఆడ పిల్లల్ని పురిటిలోనే చంపేస్తున్న అక్కడ అక్కడ అ ఇంకా కొనసాగుతోందన్నారు
దీనిపైన సమాజంలో మార్పు రావాలన్నారు
నేటికీ వరకట్న విధానం వల్ల మందికొందరు మహిళలు
 బలవుతున్నారు
మహిళల పై చిన్న చూపు
తగ్గాలి అన్నారు
నేటికీ ఆడపిల్ల  పైన ఇంకా వివక్షత  ఉండి నేటి సమాజంలో భర్త చనిపోయిన కూడా మహిళల్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు
భవిష్యత్తులో మంచి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి
ఆత్మగౌరవంతో
పురుషులతో సమానంగా పనిచేయాలన్నారు
నేడు సెల్ఫోను మీడియా ప్రభావం
చాలా ఉంది
మహిళలు అన్ని రంగాల్లో రాణించి
 విద్యుక్తధర్మాన్ని మర్చిపో రాదు
సమాజంలో మానసికమైన మార్పు రావాలన్నారు
మహిళలపై కేసులు త్వరితంగా ఫాస్ట్ ట్రాక్ లో తీర్పు వచ్చేలాకోర్టు లు ప్రభుత్వాలు పని చేయాలన్నారు
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి తాండూరు
TPS ప్రిన్సిపల్ విద్యావేత్త కీర్తి శర్మ పాల్గొని మాట్లాడుతూ
విద్యార్థులు చిన్నతనం నుండే సమాజం పట్ల అవగాహన పెంచుకుని
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని
ఉన్నత స్థాయికి ఎదగాలని
ప్రపంచానికి ఆడపిల్లల సత్తా చూపాలని
దానికి టీచర్ లని అనుకరించి
భవిష్యత్తులో డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్
లుగా ఎదిగి దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్
రమణమ్మ
మాట్లాడుతూ
కుటుంబంలో మహిళల పట్ల గౌరవం పెరగాలి స్త్రీ ఇంటికి ఇల్లాలుగా.. అన్నయ్యకు చెల్లిగా భర్తకు భార్యగా
అత్త కు కోడల గా బిడ్డకు మంచి తల్లిగా
పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలని
అప్పుడే జీవితాన్ని సార్ధకం అవుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు
సోషల్ వర్కర్ వెంకట్
 విద్యార్థులు పాల్గొన్నారు
అనంతరం
బెస్ట్ ఉమెన్ అవార్డు2022 ఇచ్చి
దేవకి దేవికి దేవిని.
కీర్తి శర్మను
ప్రిన్సిపల్ రమణమ్మ ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు
కామెంట్‌లు