వెంటాడే పద్యం; మీసాల సుధాకర్.--పి.జి.టి.తెలుగుతెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా
 సీ. కలుగడే నాపాలి కలిమి సందేహింప 
      గలిమి లేములు లేక గలుగువాడు 
    నాకడ్డపడరాడే నలిన సాధువులచే 
      బడినసాధుల కడ్డ పడెడువాడు 
    చూడడే నా పాటు జూపుల జూడక 
      జూచువారల గృప జూచువాడు 
    లీలతో నా మొరా లింపడే మొఱగుల 
      మొర లెరుగుచు దన్ను మొఱగువాడు 
తే. నఖిలరూపులు దన రూప మైనవాడు 
    నాదిమధ్యాంతములు లేక యలరువాడు 
    భక్తజనముల దీనుల పాలివాడు 
    వినడె చూడడే తలపడె వేగరాడె
పుట్టుటయు, గిట్టుటయు లేని ఆ పరాత్పరుడు నాయందు ఉన్నాడో, లేడో? అన్న సంశయం కల్గుచున్నది. లేకున్న నాపై దయ చూపడేమి? తన జ్ఞాన చక్షువులతో నన్నేల వీక్షింపకున్నాడు? కపటభక్తులకు కానరాని కమలనాధుడు, నన్ను, నా నిష్కళంక మొరను ఆలకింపకున్నాడేమీ? జగత్స్వరూపుడైన, ఆదిమధ్యాంతరహితుడై ప్రకాశించు, దీనజనభక్త భాందవుడు అగు ఆ పరంధాముడు నా ప్రార్ధనల నాలకించి, నను కని, నాపై దయతలచి నను రక్షింప వేగమే రాడా?

కామెంట్‌లు