ప్రజల గుండెల్లో కలకాలం కందికొండ ;- డా.వాసరవేణి పర్శరాములు,

  కందికొండ యాదగిరి సామాన్య కుమ్మర కుటుంబంలో సాంబయ్య-కొమురమ్మలకు మహబూబ్బాద్ నర్సమ్పేట్ మండలం నాగుర్లపల్లిలో జన్మించారు. పి.జి పొలిటికల్ సైన్సుతోపాటు తెలుగు చదివారు. సినిమా పాటలపై పిహెచ్.డి చేసి ఉస్మానియావిశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పొందారు. వారి గైడ్ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావుగారి మెప్పు పొందారు.  డాక్టర్ వాసరవేణి పర్శరాములు నైన నేను ప్రొఫెసర్ కిషన్ రావు గారి దగ్గరకు వెళ్లినప్పుడు కందికొండ గురించి గొప్పగా చెప్పేవారు. మీరిద్దరూ మట్టి బిడ్డలు (కుమ్మరులు) అంటూ గొప్పతనం తెలిపేవారు.వారు సినిమాసాహిత్యంపై పరిశోధనచేయగా, నేను బాలసాహిత్యంపై పరిశోధన చేశాను. ఎవరికి వారివి ఇష్టమైనవాటిలో పిహెచ్.డి చేశాము. కందికొండ "మట్టి వాసన" తెలంగాణ సినీ వైభవం"పుస్తకాలు ,అనేక కథలు రాశారు. కందికొండ అన్నను ఎప్పుడు అన్నా అని పలుకరించినా ఫోన్లో మాట్లాడినా ఆప్యాయంగా మాట్లాడేవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాలలోగానీ ,తెలుగు డిపార్ట్మెంట్ వద్దగాని ఎదురు పడగానే చాల సాహిత్యంపై మాట్లాడేవాళ్లం. వారు బాల్యంనుంచి కష్టపడి పైకి వచ్చారు.పాటల్లోనే కాకుండా ఆటల్లో కూడా రాణించారు. అథ్లెటిక్. 42కి.మీ రన్నింగ్ చేసి రికార్డ్ సొంతం చేసుకున్నారు. పలువురి ప్రశంసలు పొందారు.సాహిత్యంలో పరుగులు తీసారు. జానపద పాటలన్నో రాశారు.  పాటలతోట అయ్యారు. సినిమా రంగంలో దర్శకుడు పూరీజగన్నాద్ "ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం" లో మల్లీ కూయవే గూవా మోగిన అందెలతో పాట రాసే అవకాశం ఇవ్వడంతో   తర్వాత 1200లకు పైగా పాటలు రాశారు. చక్రీ కూడా పాటలు రాయించారు. రజినీకాంత్, బాలకృష్ణ చిరంజీవి,జూనియర్ ఎన్టీఆర్,మహేష్బాబు,రవితేజ లాంటి పెద్ద హీరోలకు పాటలు రాశారు. అల్లరి పిడుగు, ఆంధ్రవాలా,లింగ,దేశముదురు, ఆప్తుడు,ఒకరాదా ఇద్దరి కృష్ణులపెళ్లి,చక్రం పోకిరి,దొంగ దొంగది,రణం,పొగరు,చిన్నోడు, స్టాలిన్,ఆదిలక్ష్మి మొదలగు ఎన్నో సినిమాల్లో రాశారు."మనసమ్మా నువుండేచోటు చెప్పమ్మా," 'చూపులతో గుచ్చి గుచ్చి చంపకే", "గలగలపారుతున్న గోదారిలా.." రామా రామా ,  దలగునవి ఎన్నో పాటలు మారుమోగాయి.  తెలంగాణ పాటలు చాలా రాశారు. "చిన్ని మాబతుకమ్మ,  "రేలారే రేలారే" "కన్నేపల్లి జంగలిలో" మొలగునవెన్నో బతుకమ్మ,ఉగాది,సంక్రాంతి,బోనాల సంస్కృతి పాటలు రాశారు. తెలంగాణ ఉద్యమంలో పండుగల సమయంలో ఎక్కడ చూసినా,విన్నా కందికొండ పాటలే వినబడేవి. తెలంగాణ ప్రజలను చైతన్యం చేశారు.తెలంగాణ భాషా పదాలు భాషకు సౌందర్యం తెచ్చారు. ప్రతి తెలంగాణ పౌరున్ని పాటలు కదిలించాయి. అలాగే బి.సిలపై, కుమ్మరోల్లపై పాటలు రాశారు. మట్టి మనిషి,మంచితనానికి మారుపేరు.చిరునవ్వుతో  పలుకరించే మృదుస్వభావాన్ని కలిగి ఉండి సామాన్యంగా,నిరాడంబరంగా జీవించిన మహోతులు కందకొండ.జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.సమావేశాల్లో వివక్షకు గురయ్యారు.నేడు గొప్ప రచయితను కోల్పోయాము. క్యాన్సర్తో చాలా పోరాటం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మంత్రి కె.టి.ఆర్ స్పందించి ఆర్థికసహాయం అందించారు. విధి వెంటపడి తనను తొందరగా  తీసుకెళ్లడం బాధాకరము. అయినా వారు రాసిన పాటల్లోనే జీవించి ఉంటారు. జోహార్లు కందికొండన్నా...జోహార్లు జోహార్లు...
-- -డా.వాసరవేణి పర్శరాములు, బాలసాహిత్య రచయిత&పరిశోధకులు, తెలంగాణ వివేక రచయితల సంఘం,అధ్యక్షులు సెల్:9492193437
కామెంట్‌లు