తేనెటీగల గది ఎల్లప్పుడూ
ఒక క్రమ షడ్భుజి
ఆకారంలో ఉంటుంది.
ఎందుకంటే....
ఏవైనా కొన్ని ఒకే
పరిమాణం గల
వృత్తాలను ఒక
సమతలంలో పేర్చితే,
వాటి మధ్య ఖాళీ స్థలాలు
ఏర్పడుతాయి.
అందుకనే,
గరిష్ట వైశాల్యం ఉన్నా
కూడా తేనెటీగ తన
మైనాన్ని వృథా చేయాలనే
ఇష్టం లేక వృత్తాకార గదిని
నిర్మించుకోదు.
అదే సమబాహు
త్రిభుజాలు, చతురస్రాలు,
క్రమషడ్భుజిలను
ప్రక్కప్రక్కన అమర్చితే,
వాటి మధ్య ఖాళీ స్థలాలు
ఏర్పడవని మనకు
తెలుసూ,
ఆ తేనెటీగలకూ ఇది
తెలిసినందున,
తేనెటీగలను గొప్ప
గణిత శాస్త్ర అవగాహన
కలిగిన వాటినిగా
అభివర్ణిస్తారు.
సమాన చుట్టుకొలత
కలిగి గరిష్ట వైశాల్యం
కలిగివుండే
క్రమ షడ్భుజాకార ముఖం
కలిగి ఉండే విదంగా
నిర్మించుకుంటాయి.
దీని వల్ల ఎక్కువ తేనె నిల్వ చేయవచ్చు.
తక్కువ మైనాన్ని
ఉపయోగించవచ్చు.
విమానాలు, రాకెట్స్,
వంతెనలు, బ్రిడ్జిలు,
నట్లు, బోల్ట్ లు, పెన్సిల్స్
నిర్మాణ తయారీలో
ఈ విధానాన్నే
అనుసరిస్తారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్
విగ్రహ తయారీలో కూడా
ఈ పద్ధతినే పాటించారు.
కాబట్టి,
ఇంతటి విజ్ఞానాన్ని కలిగిన
తేనెటీగలు గొప్ప శాస్త్రజ్ఞులనుటలో
సందేహమెందుకు....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి