******************
పావులూరి గణితం
"""""""""""""""""""""'''''''''''''''
తెలుగు భాషలో మొదటిసారిగా
పది గణిత అధ్యాయాలతో
ఆచార్య
పావులూరి మల్లన
"దశ విధ గణిత" అనే
ఒకగణిత గ్రంథం వ్రాసారు.
ఈయన వ్రాసిన పద్య
కావ్య కవితాశైలి
సరళ సుందరంగా
"సార సంగ్రహ గణితం"
లో కొనసాగింది.
వారు వ్రాసిన కొన్ని
పద్యాల గురించి
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కం:
కనుమూసి రెప్ప యెత్తుట
జనుకాలము నిమిషమగును జయ్యన నవిదా
దనరు బదునెనిమిదైనను
వినుమిది యొక కాష్ఠయగును వెలయగ ధరణిన్!
తే. గీ:
నిమిష మష్టదశత నెరయగ గాష్ఠమౌ
గాష్ఠ త్రిదశకమ్ము గళకు నమరు
కళయు ద్రిదశకంబు క్షణ మన బరుగును
క్షణములారుగూడ ఘడియయయ్యె!
చం:
ఘడియలు రెండు మూర్తమన గాజనుముప్పది మూర్తవల్ దినం
బాడబడ నయ్యె దద్దిన
దశోత్తర
పంచక మేక పక్షమై
నడచు ధరిత్రి బక్షమిథునం
బాకమాసము మాస యుగ్మమే
ర్పడు రుతువయ్యెగాలమితి
పద్ధతి నారుతుషట్కమేండరు!
కాలమానాన్ని వారు
ఈ క్రింది విధంగా వివరించారు
ఒక కను రెప్పపాటు = నిమిషం
18 నిమిషాలు = ఒక కాష్ఠ
30 కాష్ఠలు = ఒక కళ
30 కళలు = ఒక క్షణం
6 క్షణాలు = ఒక ఘడియ
6 ఘడియలు = ఒక ముహూర్తం
30 ముహూర్తాలు = ఒక దినం
15 దినాలు = ఒక పక్షం
2 పక్షాలు = ఒక నెల
2 నెలలు = ఒక రుతువు
6 రుతువులు = ఒక సంవత్సరం.
ఇదేవిధంగా, బరువుల
తూకాలు, ధాన్యరాశులు
కొలుచుటకు
ఈ క్రింది విధంగా
తెలిపారు.
" ఏకం, దశం, శతం,
సహస్రం, దశసాహస్రం,
లక్షం, దశలక్షం,
కోటి, దశకోటి, శతకోటి,
అర్బుదం, న్యర్బుదం,
ఖర్వం, మహాఖర్వం,
పద్మం, మహాపద్మం,
క్షోణి, మాహాక్షోణి,
శంఖం, మాహాశంఖం,
క్షితి,మాహాక్షితి,
క్షోభం, మహాక్షోభం,
నిధి, మహానిధి,
పరతం, అనంతం,
భూరి, మహాభూరి,
మేరు, మహామేరు,
బహశం, బాహుశం,
సముద్రం, సాగరం....
ఇవి మొత్తం 36.
అనంతంగా విస్తరించి
ఉన్న
గణిత సముద్రంలో
మన భారతీయ
గణితశాస్త్రవేత్తలలో
ఒక ఆణిముత్యమైన
పావులూరి మల్లన గారికి
శతకోటి
వందనాలు!
***
పావులూరి గణితము ..!!డా.అడ్లూరు నరసింహమూర్తి >హన్మకొండ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి