చిరంజీవులు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పొద్దు పొడుపు వెలుగులు 
వెన్నెలకున్నా తళుకులు 
ఎగిరే పిట్టల బారులు 
నదిలో అలల గలగలలు 
మాటల తేనెల జల్లులు 
చల్లని వెన్నెల సోనలు 
చక్కని సిరుల మేరులు 
చిన్నారి చిరంజీవులు!!

కామెంట్‌లు