దేనికి శిక్ష దేనికి రక్ష( బాల గేయం)-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
కలుగు లున్న ఎలుక
కిస్ కిస్ న అరుస్తుంది
పుట్టలో ఉన్న పాము
బుస్సుమని చూస్తుంది

ఎనుగు లోని కోడి పిల్ల
కిచ్ కిచ్ న అరుస్తుంది
పైన తిరుగాడె డేగ పిట్ట
వేట చేయ చూస్తుంది

మక్క చేనులోన నక్క
కంకులన్ని విరుస్తుంది
నక్కి నక్కి చూస్తుంది
తిక్క తిక్క చేస్తుంది

వాటిలోన దేనికి రక్ష
అందులో దేనికి శిక్ష
గేయం మీరు చదవండి
యోచన చేసి చెప్పండి


కామెంట్‌లు