రాయలు నానీలు ;-ఎం. వి. ఉమాదేవి
 1)
తలపాగాకి 
వేలాడే  ముత్యాలు 
రాయల కాలo 
దేశీ తెనుగు అక్షరాలు !!
2)
కవనం 
ఏనుగెక్కినది 
రాజరికమేమో 
పల్లకీ మోసింది !!
3)
తమిళ కన్నడ 
కస్తూరి పరిమళo 
 రాయల కలంలో 
 ఆముక్త మైంది !!
4)
రాజకీయ 
దుర్భర చరిత్ర 
కళా క్షీణత్వం 
కారణాలు అనాదిగా !!

కామెంట్‌లు