రంగుల ప్రపంచం;--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.
చూడ చక్కని రంగులు
హరివిల్లులో రంగులు
"హోళీ"లో చిందేటి
రకరకాల రంగులు

తెలుగు,ఆకుపచ్చ, ఎరుపు,
నలుపు,నారింజ,పసుపు ,
నీలం,ఇండిగో..రంగులు
రంజింప జేయు మనసులు

జాతీయ జెండాలో
మువ్వన్నెల రంగులు
మహిని రంగుల వలయం
సుఖదుఃఖాలమయం

రంగుల్లో పరమార్థం
ఎరుగకుంటే వ్యర్థం
జీవితాన్ని సార్ధకం
చేసుకుంటే ధన్యం


కామెంట్‌లు