నభాగుడు . పురాణ బేతాళకథ.;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు నభాగుడు గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావోమరణిస్తావుఅన్నాడు.
నాభాగుడు సూర్య వంశంనకు చెందినవాడు. యయాతికి కుమారుడు, శ్రీరాముడికి ముత్తాత.
నాభాగుడు చిన్న వయసులోనే ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్తూ ముసలివాడైన తన తండ్రిని, పొలాన్ని చూసుకోమని తన అన్నలకు అప్పగించాడు. చదువు పూర్తిచేసుకొని వచ్చి తన పొలం గురించి అన్నలను అడుగగా, స్వార్థపరులైన అన్నలు నాభాగుడితో నీ వంతు ఆస్తి నాన్నగారే, ఆయన వద్దకు వెళ్లి కావాల్సింది తీసుకో అని చెప్పారు. అప్పుడు నాభాగుడు తండ్రివ ద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి, పరిష్కారం చూపమని కోరాడు. అత్యంత జ్ఞానులయిన అంగిరసులు సత్రయాగం చేస్తూ ఉన్నారని, వారికి ఆ యాగం చేసే 6వ రోజున విస్వేదేవతలకు చేసే సూక్తులు జ్ఞాపకమునకు రావు నాభాగుడిని అక్కడికివెళ్ళి వారికి ఆ సూక్తులను గుర్తుచేయమని చెప్పాడు. నభాగుడు తండ్రి చెప్పిన విధంగా చేయగా, ఆ అంగిరసులు ఆ యాగంలో మిగిలిన డబ్బును అతనికి ఇచ్చి, వారు స్వర్గానికి వెళ్ళిపోయారు.
ఆ డబ్బును తీసుకొని వస్తుండగా, ఒక నల్లని సుందరమైన ఆకారం కలిగిన ఒక యువకుడు ఆ డబ్బును తీసుకొన్నాడు. తన డబ్బును తనకు ఇమ్మని అడుగగా, నీ తండ్రి దీనిని నీకు ఇవ్వమని చెప్పినట్లయితే ఇస్తాను అని ఆ యువకుడు చెప్పాడు. నాభాగుడు తండ్రి వద్దకు వెళ్ళి విషయం చెప్పగా, తన మనోనేత్రంతో చూసిన నాభాగుడి తండ్రి ఆ యాగం చేసిన బ్రాహ్మణులు ఆ యాగంలో మిగిలిన భాగంను శివుడికి ఇస్తామని సంకల్పించారు కాబట్టి ఆ భాగం శివుడికే చెందుతుందని చెప్పి నాభాగుడిని పంపించాడు. నాభాగుడు వచ్చి అదే విషయం ఆ యువకుడికి చెప్పగా, సంతోషించిన శివుడు ఆ యజ్ఞభాగంను నాభాగుడికి ఇచ్చి, అతనికి సనాతనమైన బ్రహ్మజ్ఞానంను ఉపదేశించాడు. ఇతడు తన పనుల వలన వైశ్యత్వంను పొందాడు. నాభాగుడు సుప్రభ అను ఒక వైశ్యస్త్రీని గాంధర్వ వివాహం చేసుకోవడం వల్ల వైశ్యుడు అయ్యాడని మార్కండేయ పురాణంలో ఉన్నది.'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు