అమ్మ దీవెన;-మిట్టపల్లి పరశురాములు
తల్లియెదైవముగురవును
నుల్లమునందునగొల్వగానుత్సాహమొందన్
చల్లనిదీవనలిచ్చుయు
చల్లగ కాపాడుతల్లి సతతమురామా

అమ్మయెమనలనునెప్పుడు
నెమ్మదిగాగాంచుచుండునెయ్యముతోడన్
కమ్మనిప్రేమనుపంచెడు
అమ్మనుమించినదైవమేనవనిన లేదున్


కామెంట్‌లు