సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు

 @ వివేకం లేని విద్య, నీతిలేని వ్యాపారం, భక్తి, త్యాగం లేని ఆరాధన, మానవత లోపించిన శాస్త్రవిజ్ఞానం. వీటిని వదులు కోవాలి. గాంధీజీ
@ వివేకవంతుడైన వ్యక్తి గతాన్ని బట్టి వర్తమానాన్ని అంచనావేస్తాడు. సోఫోకిల్స్
@ వివేకవంతులు ఇతరుల తప్పుల్ని చూసి తమ తప్పులు దిద్దుకుంటారు. ఫ్రాంక్లిన్
@ వివేకవంతులు గ్రంథాలతో పాటు జీవితాన్ని అధ్యయనం చేస్తారు... లిన్ యు తాంగ్.
@ వివేకవంతులు పుస్తకాలతో పాటు జీవితాలను కూడా చదువుతారు. ధామస్
@ వివేకులు విజ్ఞాన సముపార్జనకు కాలాన్ని వినియోగిస్తారు. రూసో

కామెంట్‌లు