తాజా గజల్ ;-ఎం .వి .ఉమాదేవి
లోకం చపలమై చరిస్తు  ఉందోయి 
నాకం ఇక్కడే వరిస్తు ఉందోయి 

మోహం ద్వేషమై మిగులును ఒకనాడు 
విరహం తపములై జ్వలిస్తు ఉందోయి 

ఆశా నావఇది  ఆవలి తీరముకు 
చేరే లోగానె హరిస్తు ఉందోయి 

పోలిక లేనిదయి ప్రేమే ఘనమెంతొ 
భాగం అడగకోయ్ లగిస్తు ఉందోయి 

శోకం పొంగినా ఫలితం దక్కదే 
కోపం  సూత్రమై జనిస్తు ఉందోయి 

నీలిమ దారులివి మౌలిక భావనలు 
పడుగూ పేకలై ధ్వనిస్తు ఉందోయి 

ఏటికి ఎదురీది విజయం పొందుమా 
వత్తిడి కవనమే భరిస్తు ఉందోయి !!

✍️ వనజ .

కామెంట్‌లు