: ప్రపంచం అరచేతిలో;- లతా శ్రీ
 అమ్మా! అమ్మా!గట్టిగా అరుస్తూ ఇంట్లోకి అడుగు పెట్టాడు 5వ తరగతి చదువుతున్న రవికాంత్.ఏమైందో ఏమో అని గాభరా పడుతూ పరుగున వచ్చింది అనిత.ఏంట్రా ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని అడిగింది.వెంటనే ఏడవటం మొదలు పెట్టాడు... ఇంకా గాభరా ఎక్కువైంది..సముదాయించాలని అతనిని దగ్గరకు తీసుకుంది.ప్రేమగా తలనిమురుతూ ఏమైంది కన్నా!ఏడవకు నాన్న అంటూ గుండెల్లో పొదువుకుంది.ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు.మా సైన్స్ టీచరు..అది రెడ్ బుక్ డేటా ను స్క్రాబ్ బుక్ లా చేయమన్నాడు అన్నాడు.హ! అయితే..ఏడవాలా అంది ఊపిరిపీల్చుకుంటూ..అది కాదు అమ్మా..ఆ రవిలేడు అతను..అతను..మీకు ఫోన్ లేదు నేనైతే గూగుల్ లో సెర్చ్ చేసి రాసేస్తా అని వెక్కిరించాడు.అంతే కాదమ్మా..మనం పేదవాళ్ళమటా అతనికి రోజు గుడ్ మార్నింగ్,గుడ్ ఈవెనింగ్ చెప్పాలట..వాడి బుక్స్ నేను మోయాలట అంటూ వెక్కుతున్నాడు.. సరే నేనతనితో మాట్లాడుతా నీవు ఏడవకు.. ప్రాజెక్టు వర్క్ సంబంధించిన విషయాలు.. సైన్స్ ఫ్రిక్షన్స్ లో నేను సేకరించి ఇస్తానని సముదాయించి..అతని చేతిలో తాయిలం ఉంచి ఆడుకోవడానికి పంపింది . రాత్రి వంటకు కూరలు తరుగుతూ ఆలోచనల్లో మునిగి పోయింది.చిన్నతనంలో ఊరిలో పిల్లలు అందరు కలిసిమెలిసి ఆడుకుంటూ..బడిలో చెప్పిన పనులను చేసుకునే వారం.లింగ,మత,స్థాయి భేధాలనేవి ఉండేవా అసలు?? ఈ కాలం పిల్లలు ఎందుకిలా ఎక్కడికక్కడ తమ చుట్టూ గోడలు కట్టుకొని బ్రతుకు తున్నారు.సెల్ ఫోన్ రూపంలో ప్రపంచం మొత్తం అరచేతిలోకి వచ్చింది కాని.మనషి మొబైల్ లో బంధీ అవుతున్నాడు.అన్ని క్షణంలో మనముందు చూపే గూగుల్ ..మమతాను రాగాలు,నిజమైన స్నేహితులను ఇవ్వగలదా..ఎందుకు నెట్టింట్లో వలలో తగులుకున్న చేపలా గిలగిల లాడుతూ..అది ఒక స్టేటస్ లా ఫీలవుతున్నారు.ఎక్కడుంది లోపం అంటూ ... తీవ్రంగా ఆలోచిస్తున్న క్షణంలో...
ఏంటమ్మాయ్ ఏమైంది అలా ఉన్నావు అంటూ వంట ఇంట్లో అడుగుపెట్టిన అత్తయ్య తో జరిగిన విషయం అంతా పూస గుచ్చినట్లు చెప్పగా...అంతేనమ్మా సంపాదన పరమావధిగా కాక పిల్లలతో కాస్త సమయం గడపటం . సంస్కృతి సంప్రదాయాలు గురించి కథలు రూపంలో చెప్తుంటే..మనసు మేల్కొని నిజమైన ప్రపంచాన్ని చూడగలరు..ప్రపంచం అరచేతిలో గూగుల్ రూపంలో ఉన్న..నేర్చుకునే నేర్పరితనం..బ్రతకడం అనేది సంఘటనల అనుభవ సారం అంది.
రేపే పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల తో, పేరెంట్స్ తో చర్చించి..రోజు..నీతి కథలు చెప్పే ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది అనిత
సి.హేమలత

కామెంట్‌లు