సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 హాస్య ప్రియత్వం..
******
మనసుకు సాంత్వన, సంతోషం కలిగించి బాధలను మరిపించి ఊరట కలిగించే భావానుభవమే హాస్యం.
 నవరసాల్లో ఒకటైన హాస్యం,హాస్య ప్రియత్వం ఎదుటి మనసుల్ని రంజింప చేసే ఒకానొక అద్భుతమైన వినోద కళ.
దైనందిన జీవితంలో సంభవించే ఆందోళనలు,సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు, మానసిక వత్తిడిని తగ్గించుకునేందుకు, హాస్య సన్నివేశాలు, సంభాషణలు ఎంతగానో ఉపయోగపడతాయి...
హాస్య చతురత కలిగి ఉన్న వక్తల ఉపన్యాసాలు, ప్రసంగాలు సభలోని శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటాయి.
శారీరక మానసిక, లోపాలను ఎత్తి చూపేలా పండించే హాస్యం మనసును నొప్పిస్తుంది.ఆవేదన కలిగిస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు