అందాల అంగన;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
అందచందాలతోడ
అలరించుచుండె
కట్టుబొట్టులతోడ
కళకళలాడుచుండె

హావభావములెల్ల
హాయికొల్పుచుండె
శరీరసౌష్టవమెల్ల
సుందరముగానుండె

ముక్కుమోములుచూడ
ముచ్చటగానుండె
తీరుతెన్నులుచూడ
తీర్చిదిద్దియుండె

ఆమె సొగసు
ఆమె వయసు
ఆమె పలువరుస
ఆకట్తుకొనె మనసు

ఆమె తళుకు
ఆమె బెళుకు
ఆమె పలుకు
కలిగించె కులుకు

ఆమె చూపు
ఆమె తలపు
ఆమె వలపు
అంతరంగానకిచ్చె మెరుపు

ఆమె దరహాసం
ఆమె మెడహారం
ఆమె దృశ్యం
అన్నీ బహుసుందరం

ఆమె పొడవైనజుట్టు
ఆమె కట్టుకున్నబట్ట
ఆమె పెట్టుకున్నబొట్టు
మతులను ఖాయంగపడగొట్టు

ఆమె తొడిగిన రవిక
ఆమె కట్టిన కోక
ఆమె కోటేరునాసిక
కలిగించె కోరిక

ఆమె నవ్వు అద్భుతం
ఆమె చూపు అపరూపం
ఆమె అందం అసమాన్యం
ఆమే రూపం ఆనందదాయకం

అంగన ఒప్పుకుంటే
ఆనందముతో చిందులేస్తా
ముహూర్తం పెట్టిస్తా
మూడుముళ్ళు వేసేస్తా

మా పెళ్ళికి తప్పకరండి
మమ్మలను ఆశీర్వదించండి
మా స్వాగతసత్కారాలు స్వీకరించండి
మమ్మలను ఆనందపరచండి


అందరికి హోళీ శుభాకాంక్షలు

(అంగన చిత్రము పంపి కవితను రాయమన్న సరోజిని గారికి ధన్యవాదములు.)

కామెంట్‌లు