గణితమంటే -భయం వద్దు.....!!---డా.అడ్లూరు నరసింహమూర్తి హనుమకొండ.
మ్యాథమెటిక్స్ ను
మ్యాథమాజిక్స్ గా 
మలచొచ్చు!

మ్యాజికల్, లాజికల్
థింకింగ్ పెంచొచ్చు!

రీజనింగ్ ఎబిలిటీ
సిజరింగ్ చెయ్యొచ్చు!

బ్యాంక్ ఎగ్జామ్స్ లో
ర్యాంక్ పొందవచ్చు!

Advanced 
Techniques in
Mathematics 
(ATM) ను 
సులువుగా వాడొచ్చు!

ఎక్కాలు సులువుగా
నేర్చుకోవచ్చు!

కూడిక, తీసివేతతో
వ్రాయొచ్చు పద్దు!

గుణకారము తోటి
గణన చేయొచ్చు!

భాగాహారంను 
హారంగ మలచొచ్చు!

వర్గ సమీకరణాలు
వర్గీకరించొచ్చు

సమీకరణాలను
సులువుగా
సాధించవచ్చు!

మాత్రికలను ప్రక్రియలను
క్రమంలో  పేర్చవచ్చు!

బెర్నౌలి సూత్రంతో
ద్విపదను విస్తరించవచ్చు!

అంక శ్రేణిని 
పొంకంగా వ్రాయొచ్చు!

గుణ శ్రేణి గుణమును
గుప్పెట్లో దాచొచ్చు!

హరాత్మక,అంక శ్రేణులను
జంట పక్షులుగా 
చూడొచ్చు!

సూక్ష్మ పద్ధతుల్లో
సూక్ష్మీకరించిచ్చు!

వేద గణితం నుండి
వేగ గణితం పొందొచ్చు!

జ్యామెట్రి, ట్రిగోనోమెట్రీ
అన్నదమ్ముల అనుబంధ 
మనవచ్చు!

త్రిపరిమాణ 
స్థూప, శంఖు, గోళాల
ఘన పరిమాణంలను
శృంఖల సూత్రాలుగా, .
ప్రాక్టికల్ గా వివరించవచ్చు!

ఫలితమొక్కటైనా
సాధన మార్గాలెన్నో 
ఉండొచ్చు!

"శ్రద్దేన వర్ధతే విద్య"

అందుకే...
భయం వద్దు!
గణితం ముద్దు.!!
         ***


కామెంట్‌లు