కలశపూజ విశిష్టత.. .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు
 భారతీయ సంప్రదాయలలో అన్నిపూజలలోను కలశపూజ ముందు చేయిస్తారు.ఈకలశపూజ విషేషం ఏమిటో తెలుసుకుందాం! నీటితోనిండిన ఇత్తడి,రాగి,మట్టిపాత్రలో మామాడి ఆకులు ఉంచి దానిపై కొబ్బరికాయను ఉంచుతారు.తెలుపు లేక ఎరుపు దారం చతురాశ్రాకారపు నమూనాలో చుట్టబడిఉంటుంది.ఆపాత్రచిత్రములతోకూడాఅలంకరింపబడిఉంటుంది.అటువంటి పాత్రని'కలశం'ఈపాత్ర నీటితోకాని, బియ్యంతోకానినింపినపుడు దాన్ని'పూర్ణకుంభము'అనబడుతుంది.అది దివ్యమైన ప్రాణశక్తితో జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తివలనే  అన్ని అద్బుతమైన పనులను చేసే శక్తి శరీరానికివస్తుంది. సంప్రదాయ బద్దమైన గృహప్రవేశము, వివాహము,నిత్యపూజ మొదలైన అన్నిప్రత్యేక సందర్బాలలో తగిన వైదిక క్రియతో 'కలశము'ఏర్పాటు చేయబడు తుంది.స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారంవద్ద ఉంచబడుతుంది.ఇది మహనీయులను ఆహ్వానించేటప్పుడుకూడా వాడబడుతుంది.
మనంకలశాన్ని ఎందుకు పూజించాలి?సృష్టిఆవిర్భావానికిముందు శ్రీమహావిష్ణువు పాల సముద్రములో తననాగశయ్యపై పవ్వళించి ఉన్నాడు.అతని నాభినుండి వెలువడిన పద్మములోనుండి బ్రహ్మదేవుడు ఉద్బవించి ఈప్రపంచాన్ని సృష్టించాడని వేదాలు చెపుతున్నాయి. కలశములోనీరు సర్వసృష్టి ఆవిర్బావానికి ప్రధమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది.ఇది సమస్తానికి జీవన దాత.లెక్కలేనన్ని నామరూపాలకి,జడపదార్దముల మరియు చెరించే ప్రాణులయొక్క అంతర్గత సృష్టికర్త.ఈప్రపంచంలో సృష్టికిముందుగా నున్న శక్తినుంచి వచ్చినది.చుట్టబడినదారము సృష్టిలో అన్నింటిని బంధించే 'ప్రేమ'ను సూచిస్తుంది.శుభప్రదమైనది.ఆకులు,కొబ్బరికాయ సృష్టికి ప్రతీక అందువల్లే కలశం శుభసూచకంగా పరిగణింపబడుతుంది. అన్నిపుణ్యనదులలో నీరు,అన్నివేదాలలో జ్ఞానముమరియు దేవతలఅందరి ఆశీస్సులతో కలశంలోనికి ఆహ్వానింపబడినతరువాత అందులోని నీరు 'అభిషేకము'తొసమానంగా అన్ని వైదిక క్రియలకు వినియోగపడుతుంది.దేవాలయాల కుంభాభిషేకములు,పలురకాల విశిష్టపూజలు కలశ జలముల అభిషేకముతో విశిష్ట పధ్ధతిలో నిర్వహిస్తారు.పాలసముద్రాన్ని రాక్షసులు,దేవతలు మధించినపుడు అమృతకలశంతొనే ప్రత్యక్షమైనాడు.కలశం అమరత్వాన్నికూడా సూచిస్తుంది కనుక అమృతకలశంగా పిలువబడింది.


కామెంట్‌లు