పిల్లలహక్కు (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 ఆటలు పాటలు పిల్లలహక్కు 
అల్లరి చేతలు పిల్లలహక్కు 
నడకలు పరుగులు పిల్లలహక్కు 
హాయిగ తిరుగుట పిల్లలహక్కు 
మారాం చేయుట పిల్లలహక్కు 
తాయిలం కోరుట పిల్లలహక్కు 
బడిలో చేరుట పిల్లలహక్కు 
చదువుట రాయుట పిల్లలహక్కు
 జ్ఞానము నేర్చుట పిల్లలహక్కు !!
కామెంట్‌లు