పరిక్షిత్తు . పురాణ బేతాళ కథ ..;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు
 పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించిఉన్న బేతాళుని బంధించి భుజంపై చేర్చుకుని మౌనంగా బయలు దేరాడు.అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా నీపట్టుదల అభినందనీయమే,నాకు పరిక్షిత్తు గురించి తెలియజేయీ.తెలిసి చెప్పకపోయావోమరణిస్తావుఅన్నాడు.
' బేతాళా పరీక్షిత్తు పాండవుల తరువాత భారతదేశాన్ని పరిపాలించిన మహారాజు. ఇతను అర్జునుడి మనవడు, అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రయోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.అవి మహాభారతము యుద్ధము చివరి రోజు, దుర్యోధనుడు కూడా నేలకొరిగినాడు. అశ్వద్దామ, అర్జునుడు ఇద్దరూ పరస్పరము బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకున్నారు: కానీ పెద్దల జోక్యముతో చివరకు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొనగా అశ్వద్దామ మాత్రం ఉపసంహరణవిధ్య తెలియక "అపాండవగుగాక" అని మరలించాడు, అనగా పాండవుల వారసులు అందరూ మరణించుగాక అని ప్రయోగించాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కరిని కాపాడతాను అని మాట ఇచ్చి తల్లి కడుపులో ఉన్న పరీక్షిత్తుని తన యోగ మాయా శక్తి తో, చిన్న రూపుడై చతుర్భుజములతో, శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పిండరూపుడై ఉన్న బాలుని చుట్టూ తిరిగి కాపాడతాడు! అలా తిరుగుతున్నప్పుడు ఆ బాలుడు అలా ఉన్న కృష్ణుడిని చూసి "ఎవరు ఇతను" "ఇలా శంఖచక్రగదాకౌముదీ మొదలగు అస్త్రాలు ధరించి పీతాంబరాలతో, కిరీటముతో, వెలిగిపోతూ నా చుట్టూ తిరుగుతున్నాడు" అని తల్లి గర్భములోనే పరమాత్ముని పరీక్షించాడు. అందువల్ల ఇతనిని పరీక్షిత్తు అని అంటారు.
ఇతని కాలములోనే కలిపురుషుడు వస్తే అతనిని ఓడిస్తాడు. ధర్మరాజు అనంతరం పరీక్షిత్తునకు పాండు రాజ్యానికి పట్టాభిషేకం చేసెను. పరీక్షిత్తు 60 సంవత్సరాలు రాజ్యపాలన చేసెను. ఒకనాడు వేటకై అడవికి పోగా మృగమును తరుముచూ ఒక ముని ఆశ్రమము చేరెను. మృగమేమైనదని అడుగగా సమాధిలోనున్న ముని సమాధానం చెప్పలేదు. కోపించిన పరీక్షిత్తు అక్కడనున్న పాము శవాన్ని ముని మెడలో వేసి వెళ్ళిపోయాడు. ముని కుమారుడు శృంగి తన తండ్రి మెడలో సర్పమును వేసినవాడు ఏడు రోజులలో తక్షకుని చేత మృతి చెందుతాడని శపిస్తాడు. పరీక్షిత్తు తాను చేసిన నేరమునకు చింతించి సర్పములకు దుర్గమమైన చోట మేడ నిర్మించుకొని భద్రముగ ఉంటూ ప్రాయోపవిష్ఠుడై శుకుని వలన పుణ్యకథలను వినుచుండెను. శాప ప్రభావం వలన ఏడవ రోజు బ్రాహ్మణవేషధారులైన సర్పములు వచ్చి నిమ్మ పండ్లు కానుకిచ్చిరి. అందుండి వెలువడిన తక్షకుడు పరీక్షిత్తును కరచి అతనిని సంహరించెను. ఆ వారం రోజులలో విన్నదే మహాభాగవతము
ఇతని కుమారుడు సర్పయాగం చేసిన జనమేజయుడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు