భయం ! తోటిమనిషంటేనే భయం !!
తనవి, అనుకున్న ఆస్తుల్ని హక్కుల్ని ఎక్కడ హరించేస్తాడో నన్న అనుమాన భయం !
వాళ్ళు - వాళ్ళు ఒక్కటైపోతే
ఒంటరినైపోతానేమో నన్న భయం !
అందుకే ఈ భయం సరిహద్దుల్లో కంచెలువేయించింది !
కూడు,గుడ్డా,గూడులేకపోయినా...అత్యాధునికమారణాయు ధాలను కుప్పలు కుప్పలుగా కూడబెట్టిస్తుంది !
వాడుశత్రువనుకుని,వీడితోనూ
వీడుశత్రువనుకుని,వాడితోనూ
సంబంధాలను దృఢపరచుకుం టోంది !
శత్రువు నీమీద పడకముందే నీవే వాడిమీద విరుచుకుపడ మని ఎగదోస్తోంది !
మాటవినకపోతే ...నీ తడాఖా చూపించ మంటోంది !
శాంతి, సౌభ్రాతృత్వ సలహా లివ్వవలసిననాటో,అమెరికాలు అగ్నికి అర్ఘ్యం పోస్తూ...
ఆయుధ, ధనసహాయాలం దిస్తూ , పొరుగువాడు నాతో
సమానబలసంపన్నుడేనాటికీ కాకూడ దనే కుటిలబుద్ది ప్రదర్శన !!
సుదీర్ఘ శ్రమతో సాధించిన అభివృద్ధి, లెక్కలేనన్నిప్రాణాలు ఈహోమంలోసమిధలైతగలబడిపోతున్నాయి !!
ఎంతపని చేయించిందీభయం!
ఎంతవినాశనాన్నిసృష్టించింది!!
అసలీ భయం ఎక్కడినుండి పుట్టింది !?
ఔనా... !నేను-నేను ! నాది-నాది !! సర్వాధికారిని నేనే కావాలన్న స్వార్ధంనుండేకదూ.
పూర్తిగా వందసంవత్సరాలైనా ఈ భూమ్మీద ఉండని నీకు...
ఇంత స్వార్థమెందుకురా !?
బ్రతుకు.... బ్రతికించు !
సుఖించు... సుఖపెట్టు !
ఆనందించు... ఆనందాన్ని పంచు !
అదీ మానవత ! అదే ఈ మనిషి ఘనత !!
********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి