సాధన ...'బడి ' ...!!--డా.అడ్లూరి.నరసింహమూర్తి.>హన్మకొండ.

 రాబడి కొరకే బడి పెట్టక
పెట్టుబడిపెట్టి దిగబడి
గుడినమ్మి మడినమ్మి
నిలబడి స్థిమితబడి
పలువురి పలుకుబడితో
పైపైకెదగబడి
పలకలబడి గుర్తింపబడి
రీడర్స్ క్లబ్ స్థాపించబడి
వైద్య పరీక్షలు గావించబడి
కంటి పరీక్షలు చేపట్టబడి
సలహాసంఘం ఏర్పాటు 
చేయబడి
సంస్థాగత సమగ్ర 
వార్షిక కార్యాచరణ 
రూపొందించబడి
అంశాలన్నింటినీ 
అంశాలవారిగా 
ఆచరించబడి
చదువుల మడిగా
చదును చేయబడి
దృశ్య శ్రవణ విజ్ఞాన 
వికాస కేంద్రం 
నెలకొల్పబడి
బోధనా పద్ధతుల్లో
రాష్ట్ర అధికారులతో 
ప్రశంసించబడి
విద్యార్ధి సంఘం 
నియమింపబడి
క్రీడా ప్రాంగణం 
నిర్మించుకోబడి
అందరి ఆదరణకు
నోచుకొనబడి
'పది' ఫలితాల్లో అందరూ
ప్రధమశ్రేణి పొందబడి
తల్లిదండ్రుల 
హృదయాలను 
దోచుకోబడి
శుభాభినందనలు
స్వీకరించబడి
మీ సంఘీభావాన్ని
అర్ధిస్తోంది 
మా "సాధన" బడి.
       ***

కామెంట్‌లు