నేటికవిత:- అంశం :- (ప్రపంచ కవితాదినోత్సవం) స్పందించిన అందం కోరాడ నరసింహా రావు

 ఓ స్పందించిన హృదయ వికాస
సౌందర్యమా... నీ ప్రతిస్పందన 
మనోహరం !
నీవువరిస్తేగుర్తింపు,గౌరవాలకు 
లోటేముంటుంది !
సన్మానాలకూ సత్కారాలకూ కొదవే ఉండదుకదా !
సునిశిత ద్రష్టవు నీవు !సుందర స్రష్టవూ నీవే !!
ప్రకృతినంతా ఒడపోసేసావ్ 
కష్టసుఖాలను కలబోసేసావ్ 
చెడుతో సమరం సాగించావ్ 
విజయాలెన్నో సాధించావ్ !
   కలం, గళ మే నీఆయుధాలు
నీ అక్షర శస్త్రాస్త్రాలతో...
అపసవ్యాలను నిర్జించి... 
నవ్య సవ్య సుందర ఆనంద హర్మ్యాలెన్నో నిర్మించావ్ !
సాహితీ క్షేత్రంలో నీ విజయ కేతనం  సగర్వంగా ఎగురుతూ నీ ఠీవి ని ప్రదర్శిస్తోంది !
 సందర్భోచితంగా స్పందించ గల వివేకం నీది !
 ప్రజలను ఏలే రాజులనే... 
    ఏలగల కవి చక్రవర్తివి నీవు !
జానపదుల నోట పదమై పుట్టి 
పండితుల మదిలో పద్యమై వికసించి, కవుల కలముల నుండిగీతమై,గేయమైవివిధ రూపాలతోఅలరారుతున్నావు!
 సమ్మెలు, సత్యాగ్రహాల అగ్నికి ఆజ్యం నీవే !
నీ ఉనికే ఈ సమాజానికి చైతన్యం !
నీ అస్తిత్వమే జగతి ప్రగతికి ఆధారం !!
నీవు దిన -  దిన ప్రవర్ధమానమై 
వర్ధిల్లాలి కలకాలం. 
    ********
కామెంట్‌లు