పిల్లల రాజ్యాంగం !?; =సునీతా ప్రతాప్ ఉపాధ్యాయినీ p.s.నంధివడ్డెమాన్, నాగర్ కర్నూలు జిల్లా
బడి పిల్లలకు
మూడు భాషలను నేర్పండి
మాతృభాష
జాతీయ భాష
అంతర్జాతీయ భాష!!

బడి పిల్లలకు
మూడు పనిముట్లు నేర్పండి
కంప్యూటర్
కుట్టు మిషను
ఆటోమొబైల్

బడి పిల్లలకు
మూడు వాహనాలు నడపడం నేర్పండి
సైకిలు 
వెహికిల్
కారు

బడి పిల్లలకు
మూడు మెలుకువలు నేర్పండి
మాట్లాడడం
రాయడం
చదవడం!!!

బడి పిల్లలకు
మూడు వికాసాలు నేర్పండి
వ్యక్తిత్వ వికాసం
రాజకీయ వికాసం
సేవాభావం!!?

బడి పిల్లలకు
మూడు ఆటలు నేర్పండి
నడవడం పరుగెత్తడం నిలబడడం!!

బడి పిల్లలకు 
మూడు అలవాట్లు నేర్పండి
పుస్తక పఠనం
దేశ పర్యటన
కష్టపడి సంపాదించడం!!?

బడి పిల్లలకు
బడిబయట బడి లోపల
ముగ్గురు గురువులు ముఖ్యం
అమ్మ -నాన్న -స్నేహితుడు !!!

బడి పిల్లలకు
మూడు పూటలా భోజనం పెట్టండి !!?

Sunita Pratap teacher PS NandhiVaddheman Nagarkurnool dist 🙏 8309529273.

కామెంట్‌లు