చదువు !!?; -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయినీ p.s.నంధివడ్డెమాన్ నాగర్ కర్నూలు జిల్లా
పిల్లలకు తీపి అంటే ఇష్టం
పిల్లలకు ఆటలంటే ఇష్టం
పిల్లలకు జంతువులు అంటే ఇష్టం!!
కానీ
చదువు అంటే ఎందుకు కష్టం
చదువు అంటే ఎందుకు ఇష్టం లేదు
చదువంటే ఎందుకు ఆసక్తి రాదు!!?

ఆటలంటే అనువంశికం
ఆటలంటేఒక జీవన శైలి
చదువు అంటే నేర్చుకోవడం!!?

నేర్చుకోవాలంటే ఓర్చు కోవాలి
నేర్చుకోవాలంటే నేర్పు కావాలి
నేర్చుకోవాలంటే ఏకాగ్రత కావాలి
నేర్చుకోవాలంటే శ్రమించాలి!!?
చదవటం అంటే నేర్చుకోవడం!!?

పైకి ఎక్కాలంటే మెట్టు మెట్టు ఎక్కాలి
పట్టుదల పుట్టుకతో వస్తుంది
ధైర్యం సాహసం సహజంగా వస్తుంది
కానీ
చదువు మాత్రం చక్కగా చదువుకుంటేనే వస్తుంది
చదువు మాత్రం నేర్చుకుంటే నే వస్తుంది!!?

ఆట మాత్రం ఆడితేనే వస్తుంది
చేపకు ఈత పక్షికి ఎగరడం ఎవరు నేర్పారు!?
పాటఅయినా మాట అయినా
నేర్చుకుంటేనే వస్తుంది
చిలకమ్మకు మాట పిల్లలకు భాష
నేర్పు తేనే వస్తుంది!!?

చదువు  సహజ అనుకరణ కాదు !!
చదువు ఒక ఆధునిక పరికరం
అది నేర్చుకుంటేనే వస్తుంది!!?

 ప్రేమ తో వీధ్యార్థులకు
  Sunita pratap teacher PS Nandi waddeman Nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చక్కని వ్యక్తీకరణ