*భర్తృహరి సుభాషితములు - పద్యం (౦౩౩ - 033)*
 *అర్ధ పద్ధతి*
కందం:
*ఏనరునకు విత్తముగల దానరుఁడు*
*కులీనుఁ, డధికుఁ, డార్యుఁడతండే*
*ధీనిధి, ధన్యుఁడు, నేర్పరి,*
*నానాగుణగుణము కాంచ నంబున నిలుచున్*
*తా:*
డబ్బు ఎక్కవగా వున్న మానవుడే, మంచి కలుములో పుట్టిన వాడుగా, గొప్ప వానిగా, తెలివిగలవానిగా చెప్పబడతాడు. అతడినే తెలివిగలవాడిగా, ధన్యడిగా, నేర్పరితనము గలవానిగా గూడా చెప్తారు. అన్ని మంచి లక్షణాలు బంగారములోనే దొరికి నట్లు గా అన్న మాట ........ అని *"ఏనుగు లక్ష్మణకవి"* చెపుతున్నారు.
*భావం:*
*ఇది ఇంకొక విలక్షణమైన సంఘ లక్షణం. ఒక వ్యక్తి దగ్గర అధికంగా ధనం వుంటే, ఆ మనిషి పూర్వాశ్రమంలో ఎలావుండే వాడు, ఏమి చేసేవాడు అనే విషయాలు తెలియక పోయినా, ఆ ధనవంతుని కన్నా పూజ్యడు వేరెవ్వరూ లేరు, ఉండరు అని నమ్ముతుంది ఈ సమాజం. కానీ, ఈ సమాజంలో చాలామందికి అవగాహన అయినా మాయలో వుండి భక్తి ధనం కంటే ఐహికమైన ధనమే ఎక్కువ అనుంటున్నారు, అటువంటి వారికే కాకుండా, మన అందరికీ కూడా ఆ పరమాత్ముని ఆలోచనలో జీవించే అవకాశాన్ని ఇవ్వమని పరాత్పరుని వేడుకుంటూ..... .*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు