నీ జ్జాపకం నాతోనే 1980(ధారావాహిక 13,లో,బాగం)-- "నాగమణి రావులపాటి"
 ఇంతలో రాహుల్ కనిపించాడు దూరంగా.! ఒకింత
కంగారుకు గురియై రాహుల్ దగ్గరికి వెళ్ళింది.!
ఏమిటీ ఇలా వచ్చారు, అని అన్నది కుసుమ.!
ఏమీ లేదు నీ వెనుకే ఫాలో అయ్యా ,నీకు కాస్త
దూరం నుంచి నీవు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు..!
సరే అని నీవు మీ ఇంటికి వెళ్ళేదాకా వుందామని
ఇక్కడ నుంచున్నా అని అన్నాడు రాహుల్.!
ఔనా నేను గమనించనేలేదు అయినా
నా వెనుకే  ఎందుకు రావటం అని అడిగింది
కుసుమ .! ఇంకాసేపు నిన్ను చూడవచ్చని
అన్నాడు ,మరీ మీకు నాపై ప్రేమ శృతిమించి
రాగాన పడుతోంది.! ఎవరైనా చూస్తే ఎలా
వెళ్ళండి చూసింది చాలు నేను ఇంటిలోకి
వెళుతున్నా మీరు వెళ్ళండి ,అని అన్నది కుసుమ..! 
వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు రాహుల్ ..!
అతను వెళ్ళిన వైపే చూస్తూ ఆనందం భాష్పాలు
కంటిని ఆవరించగా వెను తిరిగింది కుసుమ..!
అందంగా తయారై గీతా కుసులు సినిమా
థియేటర్ చేరుకున్నారు ..! గీతకు చాలా ఇబ్బంది
అనిపించింది ,రాహుల్ దూరంగా వస్తూ
కనిపించాడు .!హాయ్ చెప్పి ఎవరో ఇద్దరు 
లేడీస్ క్యూలో నుంచుంటే వాళ్ళకు మనీ ఇచ్చి
మూడు టికెట్స్ తీసుకోమని చెప్పాడు.! వాళ్ళు
అలాగే అని టికెట్స్ తీసుకుని రాహుల్ కు
ఇచ్చారు ,మీరే తీసుకోవచ్చుగా వాళ్ళకు ఎందుకు
అప్పజెప్పారు అని అడిగింది కుసుమ..!
లేడీస్ కు త్వరగా ఇస్తారని ఇచ్చాలే అని అన్నాడు
రాహుల్ .! వాళ్ళు పదే పదే కుసుమను
చూస్తుంటే కొంపదీసి వీళ్ళు మానాన్నగారికి
తెలిసినవాళ్ళా ? ఏమిటి నేను తెలుసేమో
 మానాన్నగారికి చెప్పరు కదా అని గీతకు
చెప్పండి.!  ఏం కాదులేవే నీవు అందంగా వుంటావు,
నీ పొడవు జడ నీ అందాన్ని ఇంకాస్త పెంచింది.!
అందుకే వాళ్ళు దృష్టి నీపై నిలిచింది అని
సమర్థించింది ,గీత అంతే నంటావా అని అన్నది
కుసుమ..!
ఆ వచ్చిన వాళ్ళు  గీతకు అటు  పక్కనే కూర్చున్నారు, ఇటుపక్క కుసుమ పక్కనే రాహుల్
కూర్చున్నాడు .! గీత వీళ్ళవైపు కన్ను కూడా
తిప్పలేదు, కానీ ఆ వచ్చిన వాళ్ళు కుసుమను
ఊరికే గమనించటం.! చూసి రాహుల్ తో వాళ్ళతో
కలిపి టికెట్స్ తీసుకోవటం ఏమో కానీ వాళ్ళు
ఊరికే ఇటే చూస్తున్నారు .!నాకు చాలా ఇబ్బందిగా
వుంది అన్నది రాహుల్ తో.! అలా ఏం కాదులే
నీకన్నీ అనుమానాలే, నాతో సినిమా చూస్తూ
ఎంజాయ్ చేయి అంటూ కుసుమ చేయి తన
చేతిలోకి తీసుకున్నాడు.!  అంతే ఇక వాళ్ళ గురించి
ఆలోచించటం మానేసింది, సినిమాపై కూడా
దృష్టి లేదు ఈ మూడు గంటలు రాహుల్ తన
పక్కనే వున్నాడు ,అంతే చాలు అని పరవశం
మనసును ఆవరించగా అందమైన అనుభూతి
పొందింది కుసుమ, రాహుల్ పరిస్తితి కూడా అదే.!
పరిమళించిన ప్రేమ పరవశపు అనురాగాల
నడుమ ,ఆ రేయి ఎలా గడిచెనో క్షణమెక
యుగమై  రాహుల్ ను కలవాలంటే ఉత్కంట
ఉదృతమై, ఏదో చెప్పలేని బాధ మనసును
నిలువనీయక ఎలాగోలా ఆ పూట గడిపింది
కుసుమ ..! సాయంత్రం కాగానే ఊహల ఊసులనే
రెక్కలు గా చేసి రాహుల్ ను కలిసింది కుసుమ..!
కుసుమ ను చూడగానే కుసుమా నీకొక విషయం
చెప్పాలి ,నిన్ను  సినిమా హాల్లో టికెట్ తీసుకొని
మన పక్కనే కూర్చున్నది, ఎవరో తెలుసా?
(సశేషం) తరువాత బాగం రేపే..!!

కామెంట్‌లు