"నీ జ్జాపకం నాతోనే"1980,!("ధారావాహిక "9,వ,బాగం.!)- "నాగమణి రావులపాటి "
మనం ఇద్దరం కలిపి !ముడుపు కట్టాలి !అని 
అన్నాడు రాహుల్ !ముడుపా ,దేనికి !అని అడిగింది.!
కుసుమ.! మన పెళ్ళి జరగాలని ,నీతో కలిపి
ముడుపు .!కడతానని అనుకున్నా అన్నాడురాహుల్!
 పూజారి గారిని అడిగి ,ఒక ముడుపు,తీసుకున్నాడు!
ఇలాంటివి, నమ్ముతారా !మీరు అన్నది కుసుమ.!
నమ్మాలి ,ఇది గణేష్ ,కోరిక !వాడిలా కాకూడదని
నాకోరిక ..!అని అన్నాడు రాహుల్ ..!

ఏమండీ ,ఏకారణం ,చేతనయినా ,మనం విడిపోతే.!
నన్ను, మరచిపోతారా .!అన్నది ,కుసుమ.!
వాడి కధ నీకు అనవసరంగా ,చెప్పాను..!
పిచ్చి పిచ్చి ,ఆలోచనలతో, మనసు ‌,పాడుచేసుకోకు!
అని, మందలించాడు ,రాహుల్ ..!
ఇంతలో ,గణేష్ వచ్చాడు .!కుసుమను ,తీసుకుని
ముడుపు ,కట్టే ,చెట్టు ,దగ్గరికి ,వెళ్ళారు..!
ఆ చెట్టునిండా ,బోలెడు, ముడుపులు ,వున్నాయి..!
భక్తితో ,ఆ చెట్టు చుట్టూ, మూడుసార్లు ,ప్రదక్షిణ.!
చేసి ఇద్దరూ, కలిసి చెట్టు కొమ్మకు, ముడుపు.!
కట్టారు! కుసుమా ,అని పిలీచాడు! రాహుల్ ఏమిటి అన్నది ,కుసుమ!నీకేమనిపించింది! అందరూ పెళ్ళి
చేసుకుని! ఏడు అడుగులు! వేస్తే మనం ఇద్దరం..!
 కలిసి!,చాలా అడుగులు ,వేసాము, డియర్..!

పనిలో పని, పూజారిని, అడిగి, పసుపు కొమ్ము!
తీసుకుని ,నీ మెడలో! కట్టేయమంటావా..!
నాకు ,టెన్షన్ ,తప్పి ,ప్రశాంతంగా !వుంటుంది ..!
అని అన్నాడు !లేడికి ,లేచిందే ,పరుగుఅన్నట్టు.!
నేను, ఏమరుపాటుగా ,వుంటే, కట్టినా, కడతారు.!
అబ్బాయి గారికి తొందరెక్కువైందే .!అని అన్నది.!
కుసుమ, వెటకారంగా.! ఏం నీకు లేదా తొందర .!
అన్నాడు, చిలిపిగా.! ముందు మీకు జాబ్ 
రానీయండి,ఆమూడు ముళ్ళ ,ముచ్చట !
తీరుతుంది! అందాకా ,మావాళ్ళతో ,కలిసి 
వుండనీయండి !అని అన్నది! కుసుమ గారాబంగా!
వీళ్ళు సంభాషణకు! మురిసిపోయాడు గణేష్.!
గుడిలోకి ,వెళ్ళి అమ్మవారి, ఆశీర్వాదం పొంది.!
బరువెక్కిన ,హృదయాలతో బయలు దేరారు.!

ఉరుకులు వేసే ఊహలు పరవళ్ళతో  ఊరేగుతూ
వసంతాగమన ప్రకృతి పులకింతలతో విరిసిన
చల్లని వెన్నెల పవనాలు మనసును గిలిగింతలు
పెడుతుంటే ఆ హాయి ఇంతటి చెప్పుకునేలా.!
రాహుల్ ,కుసుమల,హృదయాలు ..!
రాగ,రంజితాలై !పల్లవించిన, చిగురు.!
మొగ్గ, తొడిగి ,పూవై ,ప్రేమ, సుగంధాల,మత్తులో.!
మైమరచి! ఒకరిని ,విడిచి, ఒకరు, ఉండలేని.!
స్థితికి ,చేరారు.! అనుక్షణం ,ఎక్కడ ,దూరమౌతామో!
అనే ,బెంగ ,కూడా వెంటాడి ,మనసులు, కలవర! పాటుకు !గురి ,అవుతూ ,వుంటారు..!

లక్కీగా, రాహుల్ కు, బ్యాంకులో ,జాబ్ ,వచ్చింది.!
ఆవిషయం, కుసుమకు, చెప్పాడు.! రాహుల్!
ఇద్దరి, ఆనందానికి ,అవధులు లేవు..!
కుసుమా, రెండు రోజుల్లో ,ఒకసారి కలిసి రావాలి!
ఎప్పుడు జాయిన్ ,కావాలో ,తెలుస్తుంది.!
రేపు జనవరి ,ఫస్ట్ !న్యూ ఇయర్ గ్రీటింగ్స్
చెప్పుకోవాలి! సరదాగా, ఎటన్నా వెళ్ళి వద్దాము.!
తొందరగా ,వచ్చేయ్ !నేను వెళితే రావటానికి టైమ్
పట్టవచ్చు! అని అన్నాడు రాహుల్.!

సూర్యుని లేత కిరణాలు భువిని తాకగా
ప్రకృతి పులకించి విరులన్నీ విప్పారి
కనువిందు చేయగా రాహుల్ తలపుల తో
ఆ అందమైన ప్రకృతిని తిలకిస్తూ
మేలుకాంచిన కుసుమ మనసు
గాలిలో తేలిపోతోంది ఇంకా కొన్నిరోజుల
విరహానికి తెరపడుతుంది. క్షణం కూడా నాకళ్ళుముందు చెదిరిపోడు..! 
ఇలా ఎన్నో ఊహలు చెవిలో గుసగుసలాడగా చకచకా తయారై ప్రాణానికి ప్రాణమైన
రాహుల్ ని  కలవాలని తడబడే అడుగులతో
నడక వేగం పెంచింది అప్పటికే తనకోసం
ఎదురుచూసే రాహుల్ ను చేరింది కుసుమ.!

కుసుమా ఈరోజు, న్యూ ఇయర్! మన జీవితాలు
మలుపు, తిరిగాలి !నా హృదయ, దేవేరి!
నాచెంత ,ఎప్పటికీ ,వీడిపోని  బంధమవ్వాలి!
జీవాతాంతం ,గుర్తుండిపోయే, గిఫ్ట్ ఇస్తావా!
నీవు, ఏమిచ్చినా ,నాహృదయంలో ,పదిల
పరుచుకుంటా !ఇదిగో, నేను ,నీకోసం, గీసిన
చిత్రం ! అంటూ ఒక ఆర్ట్ చాలా అందంగా
గీసి ఇచ్చాడు !రాహుల్ !అవి చెట్టు కొమ్మపై
వాలిన , ప్రేమ ,పావురాలు .!మీరు,  బొమ్మలు
గీస్తారా! !ఎంత అందంగా వేసారు! అని,తెగ
పొగిడింది! ఇంతలో ,రాహుల్ ఇలారండి, అని 
రాహుల్ ని బైక్ పై కూర్చోమంది! కళ్ళు
మూసుకోండి ,తెరవ వద్దు, అని చుట్టూ 
చూసింది !ఎవరూ లేరని ,నిర్దారించుకుని!
రాహుల్ ,అధరాలను !సుతారంగా ,ముద్దాడింది!
అంతలోనే ,సిగ్గుతో, వెనుకకు, తిరిగింది ,!రాహుల్
అమ్మా బాబోయ్ !నీవేనా !మన, పరిచయమైన!
ఇన్నాళ్ళకు !నీవు ,అంటూ, కుసుమను! దగ్గరికి,
తీసుకుని! ఆమె నుదుటిపై !ముద్దాడాడు.!

కుసుమ ,మెల్లగా ,తేరుకుని, మీరే ,అన్నారుగా.!
మరిచిపోలేని !గిఫ్ట్ ,అని ,అందుకే ,చాలా, ధైర్యం.!
తెచ్చుకుని, మీకోసం ,ఇలా !అన్నది, కుసుమ!
థాంక్యూ ,కుసుమ! నేను ఇచ్చిన ,గిఫ్ట్ కంటే.!
నీవిచ్చిన ,గిఫ్ట్ !చాలా, విలువైన ,ప్రేమ కానుక.!
అని ,ప్రేమానురాగాలు! పొందారు! ఇద్దరూ?(సశేషం)
తరువాత బాగం రేపే...!

కామెంట్‌లు