"నీ జ్జాపకం నాతోనే"1980,(ధారావాహిక,14వ,బాగం)-రాజీ "నాగమణి రావులపాటి "
ప్రశ్నార్దకంగా చూసింది కుసుమ .!ఎవరు ?మీకు
తెలిసిన వాళ్ళా నాకు చెప్పలేదేమిటి అని
ప్రశ్నలు వర్షం కురిపించింది..!
నీకు చెపితే నీవు వెళ్ళిపోతాయని చెప్పలేదు
అని అన్నాడు రాహుల్..!
ఓహో ఇలా కూడా నేర్చారా మానాన్నగారికి
తెలిసిన వాళ్ళేమో అని కంగారు పడుతుంటే
ఏమీ పట్టనట్టు వున్నారు.! మిమ్మల్ని ఏమనాలి
అని అన్నది కుసుమ, ఓకే సారీ అమ్మాయి గారు
అని నవ్వుతూ అసలు విషయం చెప్పాడు..?
నిన్న సినిమా మనం చూసాము..! పెళ్ళిచూపులు
వాళ్ళు చూసారు..! అదే మా అమ్మ నీ అత్తగారు
మా అక్కయ్య నీ ఆడబడుచు అని అన్నాడు 
రాహుల్..! చివాలున చిందేసింది కుసుమ..!
ఏమిటీ మీరనేది మీ అమ్మగారు అక్కగారూనా
నాతో ఒక్క మాటైనా చెప్పారా, నేనేమన్నా
పొరపాటుగా ప్రవర్తించి వుంటే నాగురించి
ఏమనుకునేవారు..! నిన్నటి మీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని వీరంగం వేసింది కుసుమ..!
నాకూ తెలియదు వాళ్ళు వస్తున్నట్టు మా ఇంట్లో
తెలుసుగా నీగురించి.! మా నాన్నగారికి తప్ప
అందరికీ తెలుసు ,మా అక్కయ్యతో చెప్పాను
మనిద్దరం సినిమాకు వెళుతున్నామని
మా అక్క అమ్మకు చెప్పింది ఇంకేముంది
మేము కుసుమ ను ఎప్పటినుంచో చూడాలని
అనుకుంటున్నాం .!నీవు ఇంటికి తీసుకు రమ్మంటే
తను రాదు అని చెప్పావు కావున మేము
ఈరోజు సినిమా హాలులో  కుసుమ ను
చూడాల్సిందే కావాలంటే రేపు మళ్ళీ
మీరిద్దరూ వెళ్ళండి అని పట్టుపట్టి వచ్చారు..!
మేము నీకు అమ్మ అక్కయ్య అని చెప్పవద్దు అని
అన్నారు అందుకే చెప్పలేదు అని అన్నాడు
రాహుల్..!
ఓహో మీ తరుపున మీరు అనుకుంటే సరిపోతుందా
ముందే చెపితే జాగ్రత్త పడేదాన్ని అని బుంగమూతి
పెట్టింది కుసుమ ..!సారీ సారీ ఇంకెప్పుడూ అలా
చేయను ఈ దాసుని కరుణించు అని పదేపదే
బతిమాలే రాహుల్ ను చూస్తూ ..!సర్లేండి
ఇంతకూ వాళ్ళకి నేను నచ్చానా లేదా చెప్పండి అన్నది కుసుమ ఆసక్తిగా ..!నీ అందానికి నీ వినయానికి
వాళ్ళు ఫిదా అయ్యిరు..! నువ్వు వాళ్ళకు తెగ
వచ్చేసాను మా అమ్మ అయితే నీకు ఏ కలర్
పట్టుచీర బాగుంటుంది ఏనగలైతే బాగుంటాయి
అని ఊహించు కుంటోంది..! నా కోడలు బంగారం
అని అమ్మ అంటే అక్కయ్య అయితే నీ సెలక్షన్
సూపర్ రా అని ఆనందపడి పోతోంది
ఏది ఏమైనా నువ్వు నాకు దక్కటం నాకు
అదృష్టం కుసుమా అని అనేసరికి
కుసుమ ముఖం ఎర్రబడింది.!?(సశేషం)
తరువాత బాగం రేపే..!

కామెంట్‌లు