శ్రీ శుభకృతునామ సంవత్సర ఉగాదిపండుగ-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 సీ.
గున్నమావిచిగురుకూర్మితోభుజియించి
పికకూజితమ్ముచేప్రీతినొంది
ఆమనియేతెంచియతులితవిభవము
వృక్షరాజములకురక్షసేయ
మరుమల్లెవిరజాజిమత్తుగాలులచేత
మానవాళికినిదిమధువుపంచి
గతవిషాధవెతలుకన్నీరునింపగా
"శుభకృతు"రాకయేశుభమునిడగ"
(తే.గీ.)
దివ్యపచ్చడిసేవించితీపిదనము
ఆయురారోగ్యభాగ్యమ్మునందజేసి
కూలి,ఉద్యోగి,వ్యాపారికుదుటపరిచి
సంతసమునింపవేడ్కయేజగతినిండ!!!


కామెంట్‌లు