*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *- రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము -**(౬౬- 66)*
 *రుద్ర సంహిత ప్రారంభము*
శ్లో: 
*విశ్వోద్భవస్థితిలయాదిషు హేతుమేకం*
*గౌరీపతిం విదితతత్వమనంతకీర్తిమ్|*
*మాయాశ్రయం విగతమాయమచింత్యరూపం* *బోధస్వరూపమమలం హి శివం నమామి||*
తా: *విశ్వోత్పత్తకి, స్థితి, లయ మొదలైన విషయాలకు కారణమైన వాడు, గిరిరాజుని కుమార్తె గౌరీదేవికి భర్త అయిన వాడు, తత్వము మొత్తమ తానే అయిన వాడు, అనంతమైన కీర్తి కలిగిన వాడు, మాయ తో వుండి కూడా మాయకు దూరంగా వుండగలిగిన వాడు, విమల బోధ స్వరూపుడు, భగవంతుడు అయిన పరమశివునికి నమస్కరిస్తున్నాను.
శ్లో: 
*వందే శివం తం ప్రకృతేరనాదిం*
*ప్రశాంతమేకం పురుషోత్తమం హి |*
*స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా* *నభోవదంతర్బహిరాస్థితో యః ||*
తా:  *తన మాయచేత ఈ సమస్తమైన విశ్వాన్ని సృష్టించి, ఆకాశము లాగా ఆ దేవదేవుడు విశ్వం లోపల, బయట కూడా వున్నాడు. సహజముగానే, అనాది అయిన వాడు, శాంతస్వరూపుడు, ఒకే ఒక పురుషోత్తముడు అయిన ఆదిదేవుడు శివునకు నమస్కరిస్తున్నాను.*
శ్లో:
*వందేంతరస్థం నిజగూఢ రూపం*
*శివం స్వతస్స్రష్టుమిదం విచష్టే |*
*జగంతి నిత్యం పరితో భ్రమంతి*
*యత్సంనిధౌ చుంబకలోహవత్తమ్ ||*
తా: *లోహము సూదంటు రాయిచే ఆకర్షితమై దానికి వ్రేలాడు తున్నట్టు, ఈ జగత్తు మొత్తం ఎల్ల వేళలా ఆ స్వామి చుట్టూ తిరుగుతూ వుంటుంది. తన నుండే ఈ ప్రపంచం మొత్తం సృష్టించ బడుతుంది. అంతర్యామిగా  వుండే ఆ సదాశివుని రూపము చాలా గుప్త మైనది, రహస్య మైనది. అటువంటి భగవంతుడు అగు పరమాత్మడు అయిన శివునికి సాదరముగా నమస్రిస్తున్నాను.*
*||రుద్ర సంహిత ప్రారంభము||*
                                       
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు