బానపొట్ట.. మణిపూసలు ;-పోతుల చైతన్య భారతి 7013264464
బానపొట్ట నీకుందని 
నలుగురిలో పోలేనని 
బాధ పడకోయ్ మావా 
రోగాలూ వస్తాయని 

పొద్దున్నే లేవాలి 
వ్యాయామం చేయాలి 
నిమ్మరసం నీటితో 
చెంబు నీళ్లు తాగాలి 

కూరగాయల రసం 
ఆరోగ్యం కోసం 
పరిగడుపున తాగితే 
ఇగ జూడు సంతసం 

మొలకలూ పల్లీలను 
ఖర్జూరం కలిపితిను 
ఈ అల్పాహారమిచ్చు 
ఆరోగ్యం నీదౌను 

క్యాలరీలు తక్కువగా 
ప్రోటీనులు మక్కువగా 
మరువకుండా తినాలి 
పోషకాలను మెండుగా 

నూనె,ఉప్పు,చక్కరను 
తగ్గిస్థె మంచిదేను 
రొట్టెలను ఆరగించు 
రోజంత తేలికేను 

రాత్రి తిండి ఏడులోపు
తేలికైంది ఆరగింపు 
రోగాలతో పోరాడు 
ఇమ్యూనిటి నీకు పంపు

వారంలోన  ఒకనాడు 
ఉపవాసం ఉండిచూడు 
అనుభవిస్థె తెలుస్తుంది 
ఆరోగ్యo పొందగలడు 

చక్కని దేహంతోను 
ప్రశాంతత ఒనగూరును 
కంటి నిండ నిద్రపోయి 
నూరేళ్లు జీవించును 

శ్రద్ద ఉంటె ఏదైనా 
సాధ్యమే ఎవరికైనా 
క్రమశిక్షణ జీవితం 
అవసరం జీవితానా.. (137-146)


కామెంట్‌లు