ఆటవెలది పద్యాలు;-యామ అంజలి -9వ తరగతి ,ఈ/యం జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి--కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
 1.
నాన్న చేసె  పనికి నష్టంమ్ము వచ్చినా
ప్రేమ జూపు మిన్న బిడ్డలందు 
మరువలేము నాన్న  మమ్మువీడిన గాని
అవని జనులకెల్ల అంజలింతు .
2.
పాఠశాలకెళ్లి పాఠాలు శ్రద్ధతో
వినగ వలెను మనము వినయముగను
నిత్య సాధనందు నేర్పుగల్గును చూడు
అవని జనులకెల్ల అంజలింతు .


కామెంట్‌లు